LIVE : గాంధీభవన్​లో మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం - MINISTER UTTAM PRESS MEET LIVE

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 2:20 PM IST

Updated : May 9, 2024, 5:11 PM IST

thumbnail

Minister Uttam Kumar Reddy Live Today : రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ  కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ కండువా కప్పి శంకరమ్మను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో వందల ,వేల మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలను మోసంచేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏమి చేయలేదని విమర్శించారు. తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు హస్తం పార్టీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు గ్యారం టీలతో పాటు లోక్​సభ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలు కూడా తమ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఉత్తమ్ అన్నారు.

Last Updated : May 9, 2024, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.