LIVE : దుబాయి జైల్లో నుంచి విడుదలైన సిరిసిల్ల వాసులతో కేటీఆర్ మాటాముచ్చట

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 2:21 PM IST

Updated : Feb 28, 2024, 2:48 PM IST

thumbnail

KTR Live : ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లి హత్య కేసులో ఇరుక్కుని 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురు వ్యక్తులకు అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. ఎట్టకేలకు ఆ వలస కార్మికులు సొంత ఊరికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు కూలీ చేసుకోడానికి దుబాయ్​ వెళ్లారు. నేపాల్​కు చెందిన వాచ్​మెన్​ బహదూర్​ సింగ్​ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా, తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయ్​ కోర్టు, నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది. ఈ విషయం 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లడంతో వారిని రప్పించేందుకు యత్నం చేశారు. స్వయంగా నేపాల్​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. అనంతరం ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలస కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా నేడు వారితో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు.

Last Updated : Feb 28, 2024, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.