'ఐదేళ్ల భవిష్యత్ మా చేతిలోనే ఉంది - అలాంటి నాయకుడికే మా ఓటు' - YOUNG VOTERS INTERVIEW

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 10:32 AM IST

thumbnail

Interview With youth On Elections : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క అన్ని పార్టీలు తమ ప్రచారాల్లో వేగం పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు రకాల ఎన్నికల వ్యూహాలతో రాజకీయ పార్టీలు ముందుకుసాగుతున్నాయి. రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే ఈ సారి జరగనున్న ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు కూడా భాగస్వాములు కానున్నారు.  

యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ విలువైన ఓటుహక్కును సరైన నేతలను ఎన్నుకునేందుకే ఉపయోగించాలని పలువురు అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలంటున్నారు. నోటుకోసం ఓటును అమ్ముకోకూడదని వారంటున్నారు.  ఓటు వేయడమే కాకుండా తోటివారు కూడా ఓటుహక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేటి యువతకు రాజకీయాలపై ఎంత వరకు అవగాహన ఉంది? ఈ ఎన్నికలపై వారేి మనోభావాలంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.