హైదరాబాద్‌లో మాయమైన నీడ - జీరో షాడో ఆవిష్కృతం - ZERO SHADOW VIDEO

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 3:00 PM IST

Updated : May 9, 2024, 3:37 PM IST

thumbnail
హైదరాబాద్‌లో మాయమైన నీడ - జీరో షాడో ఆవిష్కృతం (ETV BHARAT)

Zero Shadow in Hyderabad : ఏటా ప్రపంచ వ్యాప్తంగా జీరో షాడో డే సంవత్సరానికి రెండు సార్లు ఆవిష్కృతమవుతుంది. అందులో ఒక జీరో షాడో ఇవాళ ఏర్పడింది. సాధారణంగా ఎండలో ఉన్నప్పుడు మన ప్రతిబింబం నీడ రూపంలో కనిపిస్తుంది. రోజూ సుర్యుడు నడి నెత్తమీదకు వచ్చినప్పుడు మన నీడ మనకు కనిపిస్తుందని. కానీ ఈ జీరో షాడోలో ప్రతిబింబం కనిపించదు. అంటే నీడ కేవలం పాదాల కిందనే ఏర్పడుతుంది. 

హైదరాబాద్‌ భూమధ్య రేఖకు, కర్కాటక రేఖకు మధ్యలో ఉంటుందని అందువల్లే వేసవి కాలంలో జీరో షాడో డే వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే భూమధ్య రేఖకు కింద ప్రాంతాల్లో జోరో షాడో డే చలికాలంలో వస్తుందని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌తో పాటు భువనగిరి, డోర్నకల్‌ ప్రాంతాల్లో కొద్ది సమయం అటుఇటుగా జీరో షాడో ఏర్పడుతుందని తెలిపారు. ఈ అరుదైన సంఘటనను చూడటానికి ప్రజలు ఆసక్తిగా కనబరిచారు. జీరో షాడో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపేందుకు బీఎం ప్లానిటోరియం శాస్త్రవేత్త రవిరాజాతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి.

Last Updated : May 9, 2024, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.