శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేశ్- ​తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - CM Ramesh Visit Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 3:19 PM IST

thumbnail
శ్రీవారిని దర్శించుకున్నా సీఎం రమేశ్- ​తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ (ETV Bharat)

CM Ramesh Visit Tirumala : రాష్ట్రంలో పోలీసులు చాలా కాలం తర్వాత నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో రావణా రాజ్యం నశించి రామరాజ్యం రాబోతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.​ కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్‌కు ఇంకా వసూలు కావాల్సిన డబ్బులు ఉండటంతోనే ఐప్యాక్‌ సమావేశంలో గొప్పలు మాట్లాడారని విమర్శించారు.

Devotees Visit Tirumala in Huge Numbers in Tirupathi District : తిరుమలలో వరుసగా మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో భక్తులు వేచి చూస్తున్నారు. గోగర్భం జలాశయం వరకు భక్తులు క్యూలైన్‌లో నిలబడి ఉన్నారు. క్యూలైన్‌లో ఎక్కువసేపు నిలబడలేక పిల్లపాపలతో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.