నెల్లూరులో క్రికెట్‌ మ్యాచ్‌లో వివాదం- కడప నుంచి పిలిపించి దాడి - Cricket Match Dispute

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 5:05 PM IST

thumbnail

Cricket Match Dispute Between Youths in Nellore District : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో క్రికెట్​ ఆటలో ఇద్దరు యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో ఓ యువకుడి చేతికి గాయమైంది. దీంతో ఆ యువకుడి సోదరుడు భార్గవ్​ సాయి కడప జిల్లా బద్వేల్​ నుంచి సుమారు 30 యువకులను తీసుకొచ్చారు. తన సోదరుడు చేతికి గాయం చేసిన కార్తీక్​ అనే యువకుడు ఇంట్లోకి చొరబడి కర్రలతో వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు.

Attack with Sticks in Tikkavaram Village : ఈ దాడిలో కార్తీక్​తో పాటు మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక్​ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో దళితవాడకు చెందిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్రికెట్​ మ్యాచ్​లో జరిగిన వివాదంలో ఇంటి వద్దకు వచ్చి దాడి చేయడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.