'జగన్​ పాలనలో ఆర్థిక అవకతవకలు'- ఎంపీ రఘురామ పిల్​పై హైకోర్టులో విచారణ వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 2:05 PM IST

thumbnail

AP High Court on MP Raghu Rama Pill: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతిపై ఆ పార్టీ రెబల్​ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిల్​పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. ఈ పిటిషన్​పై గతంలోనూ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు(AP High Court) 41మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, కౌంటర్లు వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.  

కేసు వివరాలివీ: వైఎస్సార్సీపీ(YSRCP Govt) హయాంలో.. సీఎం జగన్, ఆయన బంధుగణానికి అనుచిత లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిల్​ వేశారు. ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామరాజు వేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(Public interest Litigation)లో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్ రెడ్డి(CM YS Jaganmohan Reddy), ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy)తో పాటు పలువురు మంత్రులు, అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.