ఓటు వేసేందుకు వచ్చి మృతి చెందిన వృద్ధురాలు - Old lady Died After Voting

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:57 PM IST

thumbnail
ఓటు వేసేందుకు వచ్చి మృతి చెందిన వృద్ధురాలు (ETV Bharat)

88 Year Old Woman Dies After Voting in Anakapalli : అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామంలో ఓటు వేసేందుకు వచ్చిన 88 ఏళ్ల వృద్ధురాలు జయవరపు నాగాయమ్మ మృతి చెందారు. గాంధీ గ్రామం సిటిజన్ కాలనీలో ఉన్న అంకుపాలెం (హెచ్) మండల పరిషత్ పాఠశాలలో 181 పోలింగ్ బూత్​లో ఆమె ఓటేశారు. ఓటేసిన పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి సొమ్ము సిల్లి పడిపోయింది. వెంటనే స్థానికులు వైద్యుడ్ని పిలిపించి చికిత్స అందించారు. అప్పటికే ఆవిడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలింగ్​ వేళ వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రాష్ట్రంలో పలు చోట్ల పోలింగ్​ బూత్​లలో దాడులు జరిగాయి. పలు పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా రక్తం వచ్చేలా కొట్టారు. అదేెంటని ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. పోలింగ్​ బూత్​లలో అరాచకంగా చొరబడి అధికారులను సైతం దుర్బాషలాడారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను వైఎస్సార్సీపీ నేతలు దాష్టీకాలతో చెడగొట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.