ETV Bharat / technology

ఇకపై వాట్సాప్‌ పేమెంట్స్‌ మరింత ఈజీ - చాట్‌ లిస్ట్‌లోనే QR కోడ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 1:32 PM IST

Whatsapp Payments
Whatsapp UPI Payments Feature

Whatsapp UPI Payments Feature : వాట్సాప్​ తన పేమెంట్స్‌ ఫీచర్‌ను మరింత సులభతరం చేసింది. ఇకపై చాట్‌ లిస్ట్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ కనిపించే విధంగా మార్పులు తీసుకువచ్చింది.

Whatsapp UPI Payments Feature : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్​ఫామ్​ వాట్సాప్‌ తన యూజర్లు కోసం పేమెంట్స్​ ఫీచర్​ను మరింత సులభతరం చేసింది. చాట్‌ లిస్ట్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ కనిపించే విధంగా మార్పులు తీసుకువచ్చింది. వాస్తవానికి వాట్సాప్​ దేశంలో తన యూపీఐ పేమెంట్స్​ సేవలను ప్రారంభించి చాలా రోజులే అయ్యింది. కానీ దీనికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు.

యూజర్లు చాట్‌ చేసేందుకు, స్టేటస్‌లు చూసేందుకు, ఆడియో/ వీడియో కాల్స్​ చేసుకునేందుకు మాత్రమే వాట్సప్‌ను విరివిగా వాడుతున్నారు. కానీ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్​ను మాత్రం వాడడంలేదు. దీనిని గుర్తించిన వాట్సాప్​, తమ యూజర్లను చేరుకునేందుకు సరికొత్త ప్లాన్​తో ముందుగు వచ్చింది. యూపీఐ పేమెంట్స్‌ ఫీచర్‌ను చాలా సులభతరం చేసింది.

చాల్​ లిస్ట్​లోనే క్యూఆర్​ కోడ్​!
ప్రస్తుతం వాట్సప్‌ పేమెంట్స్‌ చేయాలంటే త్రీ డాట్స్‌లోకి వెళ్లి, పేమెంట్స్‌ మెనూ ఓపెన్ చేసి చెల్లింపులు చేయాల్సి వస్తోంది. దీనితో దీనిని యూజర్లు వాడడానికి ఇష్టపడడం లేదు. అందుకే వాట్సాప్​ ఇకపై చాట్‌ లిస్ట్​లోనే క్యూఆర్ కోడ్​ను పొందుపరుస్తోంది. దీనితో సింపుల్​గా పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది. వాట్సప్‌ బ్యానర్‌, కెమెరా సింబల్‌ మధ్యలో కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ను ఇస్తున్నారు. దీనిని ఉపయోగించి, వాట్సాప్‌ యూపీఐకి లింక్‌ చేసిన బ్యాంక్​ ఖాతా ద్వారా నేరుగా పేమెంట్స్‌ చేయవచ్చు. దీనివల్ల యూజర్ల మంచి పేమెంట్ ఎక్స్​పీరియన్స్ లభిస్తుంది. పైగా సమయం కూడా ఆదా అవుతుంది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ వాట్సాప్​ పేమెంట్​ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. మిగతావారికి దశలవారీగా ఈ ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నారు.

వాట్సాప్​ 'సెర్చ్​ బై డేట్' ఫీచర్​
ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది. అందులో భాగంగా 'సెర్చ్ బై డేట్'​ అనే సరికొత్త ఫీచర్​ను రోల్​అవుట్​ చేస్తోంది. ఈ 'సెర్చ్​ బై డేట్' ఫీచర్​ ద్వారా మీకు కావాల్సిన నిర్దిష్ట తేదీలోని మెసేజ్​లను, మీడియా ఫైల్స్​ను సులువుగా చూడవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్​లతోపాటు ఐఓఎస్​, మ్యాక్​, వాట్సాప్​ వెబ్​ల్లోనూ పనిచేస్తుంది.

లిమిటేషన్​
ఈ సెర్చ్ బై డేట్ ఫీచర్ ఉపయోగిస్తే, మీరు కోరుకున్న తేదీలోని చాట్​లు అన్నీ కనిపిస్తాయి. అలాకాకుండా, ప్రత్యేకంగా మీకు కావాల్సిన చాట్​ను​ మాత్రమే సెర్చ్​ చేద్దామంటే కుదరదు.

వాట్సాప్​ 'సెర్చ్​ బై డేట్' ఫీచర్​ - ఎలా వాడాలంటే?

వాట్సాప్​లో 4 కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్స్​ - ప్రత్యేకతలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.