ETV Bharat / technology

స్విచ్​​ ఆఫ్​ అయినా మీ ఫోన్​ను ఈజీగా కనిపెట్టొచ్చు! అందుబాటులోకి గూగుల్​ సరికొత్త ఫీచర్​! - Google Find My Device Network

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 6:11 PM IST

Google Find My Device Network : ఇకపై ఫోన్​ పోయినా, స్విచ్​​​ ఆఫ్​ అయినా చాలా సులువుగా కనిపెట్టవచ్చు. గూగుల్ తాజాగా తీసుకొచ్చిన 'ఫైండ్​ మై డివైజ్ నెట్​వర్క్'​ ఫీచర్​తో సులువుగా వెతకొచ్చు. ఈ ఫీచర్​ను గూగుల్​ ఆండ్రాయిడ్​ మొబైల్స్​లో తీసుకొచ్చింది. అది ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే ట్రాక్ చేయవచ్చు. ఈ సూపర్​ ఫీచర్​పై మరిన్ని వివరాలు మీకోసం.

Google Find My Device Network
Google Find My Device Network

Google Find My Device Network : పొగొట్టుకున్న, స్విచ్​ ఆఫ్​ చేసిన ఫోన్​ను చాలా సులువుగా కనిపెట్టేందుకు గూగుల్​ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫీచర్​ను 'ఫైండ్​ మై డివైజ్ నెట్​వర్క్'​ను ఆండ్రాయిడ్​ మొబైల్స్​లో సోమవారం ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి కెనడా, అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ను​, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్​​తో పొగొట్టుకున్న ఫోన్​ను చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. అలాగే ఒకవేళ దొంగలు మీ ఫోన్​ను స్విచ్​​​ ఆఫ్ చేసినా సరే దానిని ట్రాక్ చేసేవచ్చు. అది కూడా ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ లేకపోయినా బ్లూటూత్​ని ఉపయోగించి ట్రాక్​ చేసేలా ఈ కొత్త అప్​డేట్​ను తీసుకొచ్చింది గూగుల్.

ఈ ఫీచర్ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్​ మాత్రమే కాదు, వాటితో పెయిర్ చేసిన ఇయర్​బడ్స్, హెడ్​ఫోన్స్​ను కూడా ట్రాక్ చేసుకోవచ్చట. అంతేకాదు ఆండ్రాయిడ్​ ఫోన్​తో లింక్​ చేసి ఉన్న వాలెట్స్​, కీస్​, బైక్​లను కూడా సులువుగా కనిపెట్టేయవచ్చని గూగుల్​ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 నంచి ఆపై వెర్షన్​లు ఉన్న మొబైళ్లలో మాత్రమే అందుబాటలో ఉంటుంది. పొగొట్టుకున్న వస్తువులను గుర్తించడానికి ఈ ఫీచర్​లో ఐదు రకాలు మార్గాలు ఉన్నాయి. అవేంటంటే.

Locate offline devices : ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్లెట్​ను ఫైండ్​ మై డివైజ్​ను ఆన్​ చేయటం వల్ల ఇంటర్నెనెట్ కనెక్షన్ లేకపోయినా గుర్తించవచ్చు. అయితే పిక్సల్​ 8, పిక్సల్​ 8ప్రో వినియోగదారులకు మాత్రం, మొబైల్ స్వీఛ్​ ఆఫ్​ అయినా సరే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

Compatible Bluetooth Tags( బ్లూటూత్ ట్యాగ్​లు) : చిపోలో, పెబుల్​బీ (ట్రాకర్​ డివైజ్​ కంపెనీలు) లాంటి వాటితో రూపొందించిన బ్లూటూత్ ఆధారిత ట్రాకర్​ ద్వారా ట్యాగ్ చేసిన కీస్, వాలెట్స్, లగేజీ వంటి వస్తువులను కూడా గుర్తించవచ్చు. అలాగే బ్లూటూత్ ట్యాగ్ వినియోగదారులను ఏవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే వారిని హెచ్చరించేలా unknown tracker alerts ఆప్షన్​ కూడా ఉంది.

Find Nearby Items : వినియోగదారులు వారు పోగొట్టుకున్న వస్తువు దగ్గరగా ఉండి, దాన్ని ట్రాక్ చేయటంలో ఇబ్బంది ఉన్నప్పుడు, 'ఫైండ్​ నియర్​బై' బటన్ నొక్కితే సులభంగా కనిపెట్టవచ్చు. దీని ద్వారా కీస్​, వ్యాలెట్​ వంటి రోజూవారి వస్తువులను కూడా సులభంగా కనిపెట్టవచ్చు.

Pinpoint Devices at Home with nest : మనం పోగొట్టుకున్న డివైజ్​లు మన ఇంటికి దగ్గర్లోనే ఉండవచ్చు. అలాంటప్పుడు ఫైండ్​ మై డివైజ్, గూగల్​ నెస్ట్ (స్పీకర్​, స్క్రీన్స్​, థెర్మోస్టార్ట్​, వంటి గూగుల్​ స్మార్​ హోమ్​ ప్రొడక్ట్​లు)​తో కనెక్ట్​ అవుతుంది. తద్వారా పోయిన వస్తువు మన ఇంటికి ఎంత దూరంలో ఉందనే విషయం తెలుస్తుంది.

Share Accessories with Friends and Family : ఫైండ్​ మై డివైజ్​ యాక్సెస్​ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఉండేలా చూసుకోవటం మంచిది. ఏదైనా వస్తువులు పోయినప్పుడు దానిని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

అందుకే ఆలస్యం
ఈ ఫీచర్​ను గూగుల్ సెప్టెంబర్​ 2023లోనే ప్రకటించింది. కానీ దీని కంటే ముందు సేమ్​ ఫీచర్స్​తో యాపిల్ కంపెనీ 'యాంటీ-స్టాకింగ్' ఫీచర్​ను లాంఛ్ చేసింది. యాపిల్ కంపెనీ 2019లో మొదటిసారిగా ఎయిర్​ట్యాగ్​ను ప్రారంభించింది. అప్పుడు కొంత మంది వ్యక్తులు ఈ బ్లూటూత్ బేస్డ్​ ట్రాకర్​ను చట్టవిరుద్ధంగా, ఇతరులను ట్రాక్​ చేయడానికి ఉపయోగించారు. దీనితో యాపిల్ కంపెనీ, తమ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఒక అలర్ట్ ఫీచర్​ను తీసుకువచ్చింది.

అయితే ఈ ఫీచర్​ కేవలం ఐఫోన్, ఐప్యాడ్​లకు మాత్రమే పరిమితం అయ్యింది. తరువాత బ్లూటూత్ ఆధారిత ట్రాకర్​ను గుర్తించి, వాటిని తొలగించడానికి యూనివర్సల్ మెకానిజంతో ముందుకు రావడానికి యాపిల్ కంపెనీ గూగుల్​తో జతకట్టింది. శాంసంగ్​, టెలీ, చిపోలో, యూఫీ సెక్యూరిటీ, పెబుల్​బీ లాంటి ఇతర బ్రాండ్​లు కూడా ఈ డ్రాఫ్ట్​ స్పెసిఫికేషన్​కు మద్దతునిచ్చాయి. దీంతో ఈ బ్రాండెడ్ డివైజ్​లు ఉపయోగించే వినియోగదారులు అందరూ, తమను అనుసరించే ట్రాకర్ల గురించి అలర్ట్​లు పొందే వీలు ఏర్పడింది. దాని కారణంగా గూగుల్ ఇప్పుడు ఫైండ్​ మై నెట్​వర్క్ ఈ ఫీచర్​ను ప్రారంభించింది. ఈ ఫీచర్​తో మన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పొగొట్టుకున్న వస్తువుల లోకేషన్​ను వస్తువు యజమానితో మాత్రమే షేర్ చేస్తుందని గూగుల్ చెబుతుంది.

అప్పులు త్వరగా తీర్చేసేందుకు సూపర్ మార్గం ఇది! - how to clear loans fast

క్రెడిట్ కార్డ్​తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.