ETV Bharat / state

'రాజధాని ఫైల్స్‌' సినిమాను ఆపండి - హైకోర్టులో వైఎస్సార్సీపీ నేత పిటిషన్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 11:20 AM IST

YSRCP Leader Lella Appi Reddy Filed Petition on Rajdhani Files Movie: 'రాజధాని ఫైల్స్‌' సినిమా విడుదలను నిలువరించాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.

YSRCP Leader Lella Appi Reddy Filed Petition on Rajdhani Files Movie
YSRCP Leader Lella Appi Reddy Filed Petition on Rajdhani Files Movie

YSRCP Leader Lella Appi Reddy Filed Petition on Rajdhani Files Movie : 'రాజధాని ఫైల్స్‌' సినిమా విడుదలను నిలువరించాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి (CM Jagan Mohan Reddy), ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్‌ సినిమా తీశారని, గత సంవత్సరం డిసెంబర్‌ 18న సెంట్రల్‌ బోర్డాఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (CBSC) జారీ చేసిన ధ్రువ పత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి కోరారు.

Rajdhani Files Movie Release Date : పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపించారు. చిత్రంలోని పాత్రలు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని (MLA Kodali Nani), తదితర సభ్యులను పోలి ఉన్నాయని అన్నారు. చిత్రంలో పాత్రల పేర్లు మార్చినప్పటికీ నిజ జీవితంలో వ్యక్తుల పేర్ల మాదిగా ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీని ప్రజల్లో చులకన చేయాలనే ఉద్దేశంతో చిత్రాన్ని నిర్మించారని అన్నారు. ట్రయల్‌ను పరిశీలిస్తే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతిష్ఠను తక్కువచేసి చూపించారని పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని నిర్మించారని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితులకు లోబడి ఉంటుందని తెలిపారు. ఈ నెల 15న చిత్రం విడుదల కాబోతుందని అన్నారు. ప్రదర్శనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

'రాజధాని ఫైల్స్‌'కు యూట్యూబ్‌లో విశేష స్పందన - కొన్ని క్లిపింగ్స్​​లు తెగ వైరల్

Petition on Rajdhani Files Movie in High Court : నిర్మాతల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. చిత్రాన్ని పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించిందని తెలిపారు. తాము రివిజన్‌ కమిటీని ఆశ్రయించామని, ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించామని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్​లో ధ్రువ పత్రం జారీ చేస్తే వైసీపీ ఇప్పుడు పిటిషన్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, సోనియా గాంధీ, రోశయ్య తదితర నేతల ప్రతిష్ఠ దెబ్బతినేలా సన్నివేశాలున్నాయని సీబీఎఫ్‌సీ పేర్కొందని అన్నారు. రాజధాని ఫైల్స్‌ సినిమాలో ఎవరి ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కించపరిచేలా సన్నివేశాలు లేవని పేర్కొన్నారు. చిత్ర విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

రాజధాని ఫైల్స్​ చిత్రానికి ఏ పార్టీతో సంబంధం లేదు: మూవీ యూనిట్​

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ వాదనలు వినిపిస్తూ.. చట్ట నిబంధనల మేరకు ధ్రువపత్రం జారీ చేశారని అన్నారు. పదమూడు సన్నివేశాలను తొలగించారని తెలిపారు. ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రముఖుల పేర్లను సినిమాలో వినియోగించలేదని అన్నారు.

రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.