ETV Bharat / state

కవ్వాల్ టైగర్​ రిజర్వ్​ నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 10:29 PM IST

Kawal Tiger Reserve Adilabad
Villages Evacuation From Kawal Tiger Reserve

Villages Evacuation From Kawal Tiger Reserve at Nirmal : కవ్వాల్ టైగర్​ రిజర్వ్​ నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం అయింది. అటవీ ప్రాంతం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం కాలనీ పనుల పురోగతిని కవ్వాల్​లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ ఏం డోబ్రియాల్ ఇవాళ సమీక్షించారు. గ్రామాల తరలింపులో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, మరికొందరికి ఇళ్ల నిర్మాణం, సాగు భూమి కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Villages Evacuation From Kawal Tiger Reserve at Nirmal : కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం అయింది. అటవీ ప్రాంతం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం కాలనీ పనుల పురోగతిని కవ్వాల్​లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ ఏం డోబ్రియాల్ నేడు సమీక్షించారు. స్థానిక అధికారులతో కలిసి పునరావాస కాలనీని(Resettlement Colony) సందర్శించటంతో పాటు, లబ్దిదారులతో సమావేశం అయ్యారు.

పెద్ద పులుల డెన్​ కవ్వాల్​ నుంచి గ్రామాల తరలింపు

కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​ నుంచి గ్రామాల తరలింపుపై ఇటీవల సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. తరలింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండడంతో పాటు మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు. దీంతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి నేడు క్షేత్ర పర్యటన చేశారు. మొదటి దశలో పునరావాసానికి రాంపూర్, మైసంపేట గ్రామాలు స్వచ్ఛందంగా అంగీకరించాయన్న ఆర్ ఏం డోబ్రియాల్ కేంద్ర ప్రభుత్వం (NTCA) నిబంధనల ప్రకారం రెండు ప్రతిపాదనలతో అటవీశాఖ పనులను చేపట్టిందని తెలిపారు.

ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం : గ్రామాల తరలింపులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏక మొత్తంగా రూ.15 లక్షల పరిహారం అందిచడం ఒక ప్రతిపాదన అని వివరించారు. దీనికి 48 కుటుంబాలు అంగీకరించి ఆ మేరకు పరిహారం స్వీకరిస్తున్నాయని, ఇక రెండవ ప్రతిపాదనకు అంగీకరించిన 94 కుంటుంబాలకు అవే రూ.15 లక్షల పరిహారంలో భాగంగా ఒక ఇల్లు నిర్మాణంతో పాటు సాగు భూమిని(Cultivated Land) కూడా ప్రభుత్వం సమకూర్చుతోందని వివరించారు.

Kawal Tiger Reserve Adilabad : కవ్వాల్​కు సమీపంలోనే అటవీ ప్రాంతం బయట కొత్త మద్ది పడగలో అన్ని వసతులతో పునరావాస కాలనీ నిర్మాణం వేగంగా జరుగుతుందని, మొత్తం 12.36 ఎకరాల్లో కాలనీ నిర్మాణం ఏర్పాటు అవుతోందని వివరించారు. ఒక్కో కుటుంబానికి 333 చదరపు గజాల్లో ఇల్లు, 2.81 ఎకరాల సాగుభూమిని అందిస్తున్నామన్నారు. కాలనీలో సామాజిక ఏర్పాట్లు(Social Arrangements), పనుల తీరుగా లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పనులన్నీ పూర్తి కాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటుచేసి లబ్ధిదారులకు అందిస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ ఏం డోబ్రియాల్ తెలిపారు.

పులుల ఆవాసాలకు 400 జింకలు..!

పులి క్షేత్రంలో అక్రమార్కుల దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.