ETV Bharat / state

మరో 15 రోజుల్లో మేడిగడ్డ బ్యారేజ్​ ఘటనపై సమగ్ర నివేదిక : విజిలెన్స్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 6:53 PM IST

Updated : Jan 23, 2024, 8:00 PM IST

Vigilance Officials Investigation on Medigadda Barrage Issue : విజిలెన్స్​ అధికారుల మేడిగట్ట బ్యారేజ్​ కుంగిపాటుపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాజెక్ట్​కు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. నిర్మాణం చేపట్టినప్పుడు రీడీజైన్​ ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ వివరాలతో మరో 15 రోజుల్లో సమగ్ర సమాచారంతో రిపోర్టు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Medi Gadda Barrage Redsign Reason
Vigilance Officials Investigation on Medigadda Barrage

Vigilance Officials Investigation on Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన వ్యవహారంలో మరో 15 రోజుల్లో రిపోర్టు సిద్దం చేయనున్నట్లు విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కీలక అధారాలు సేకరించారు. మేడిగడ్డ కుంగి పోవడానికి డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపమే ప్రధాన కారణమని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజిలో ఏడో బ్లాక్‌లోని 20వ పియర్ ధ్వంసం కాగా ఎనిమిదో బ్లాక్‌లో క్రాకులను అధికారులు గుర్తించారు. బ్యారేజీలో నీరు ఉండడంతో త్వరలో మిగిలిన పియర్స్‌ను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఒక్కో పియర్‌ను రూ.50కోట్లతో నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం వాటిని మళ్లీ నిర్మించడానికి రూ.65కోట్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు.

మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు - విజిలెన్స్ అధ్యయనంలో గుర్తింపు

Medi Gadda Barrage Redsign Reason Telangana : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రతిపాదిత డిజైన్‌ కాకుండా రీడైజన్​ చేశారనే కోణంలో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందోనని తెలుసుకుంటున్నారు. అధికారుల బృందం డీపీఆర్‌ను పరిశీలిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణంలో అధికారులు సీపేజ్‌, ప్రెజర్‌ కంట్రోల్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయంలో ఆరా తీస్తున్నారు. జాతీయ గుర్తింపు పొందిన నాణ్యత పరిశీలన ఇంజినీర్లతో పరీక్షలు చేయిస్తున్నారు. అదే విధంగా నిర్మాణానికి ఉపయోగించిన సిమెంట్​ను కెమికల్‌ ఎనాసిస్‌ చేయించనున్నారు. దర్యాప్తులో భాగంగా కొందరు అధికారులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.

అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో సాగు నీటి కేటాయింపులు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Vigilance Officials on Medigadda Barrage Incident : ప్రభుత్వం సమాచారం అడిగితే ఇస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ సమయంలో ఇతరులను బ్యారేజీ సమీపంలోకి ఎందుకు అనుమతించలేదో తెలియదని అధికారులు అంటున్నారు. నిర్మాణానికి ముందు భూమి స్థితి సహా మొత్తం 5 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా వాటిని సరిగా చేశారా లేదా అనే కోణంలో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Medigadda Barrage Incident Update : గతంలో విజిలెన్స్​ అధికారులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీలోని ఏడో బ్లాక్​తో పాటు 6, 8 బ్లాక్‌లలోని ఇతర పియర్స్‌కు నష్టం వచ్చిందని గుర్తించారు. డిజైన్‌తో పాటు నాణ్యత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. అనంతరం అధికారులు బ్యారేజీపై మరింత లోతుగా అధ్యయనం చేపట్టారు. జనవరి 9 నుంచి విజిలెన్స్​ అధికారులు ఈ ప్రాజెక్ట్​పై దృష్టి సారించారు. అప్పటినుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్​పై పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్​లో జరిగిన నష్టానికి గల కారణాలను అధికారులతో చర్చించి విజిలెన్స్​ అధికారులు తెలుసుకుని నివేదిక తయారు చేస్తున్నారు.

కాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ సోదాలు

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Last Updated : Jan 23, 2024, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.