ETV Bharat / state

హోలీ వేడుకల్లో విషాదం - వాటర్‌ ట్యాంక్‌ కూలి బాలిక మృతి, మరో ఇద్దరికి గాయాలు - TS HOLI CELEBRATIONS 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 2:34 PM IST

TRAGEDY IN HOLI CELEBRATIONS
TRAGEDY IN HOLI CELEBRATIONS

Tragedy in Holi Celebrations at Narayanpet District : హోలీ పండుగ ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. తోటి స్నేహితులతో కలిసి ఆ బాలిక ఆనందంగా ఆడుకుంటుంది. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆ చిన్నారిని బలితీసుకుంది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది.

Tragedy in Holi Celebrations at Narayanpet District : హోలీ పండుగ కావడంతో ఆ చిన్నారి అప్పటి వరకూ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతోంది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రంగు బాటిల్స్​లో నీటిని నింపుకునేందుకు ఆ బాలిక తన మిత్రులతో కలిసి వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వాటర్‌ ట్యాంక్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

హోలీ వేడుకల్లో అపశృతి.. చెరువులో గల్లంతై వ్యక్తి మృతి

Child Died Water Tank Collapse Incident : నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్​పేట వీధిలో లక్ష్మి ప్రణతి అనే బాలిక 7వ తరగతి చదువుతుంది. ఈరోజు హోలీ (Holi Celebrations 2024) కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా ఆడుకుంటుంది. ఇంతలో రంగు బాటిల్స్​లో నీరు నింపుకునేందుకు స్నేహితులతో కలిసి వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలడం ఆ శిథిలాలు వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో లక్ష్మి ప్రణతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Holi Celebrations in Telangana : అక్కడి నుంచి బాధితులను మెరుగైన చికిత్స కోసం మహబూబ్​నగర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకూ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆ చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హోలీ సంబురాల్లో విషాదం.. చెరువులు, కుంటల్లో స్నానాలకు వెళ్లి 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.