ETV Bharat / state

ఉప్పల్​ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ పంజాబ్​ మ్యాచ్ - ఆ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు - Traffic Diversion Due To ipl match

author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 12:25 PM IST

Updated : May 19, 2024, 2:22 PM IST

Traffic Diversion At Uppal Due To IPL Match : ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో ఎస్​ఆర్​హెచ్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ తరుణ్​ జోషి వెల్లడించారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదీగూడ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు భగాయత్‌ రోడ్డు వైపు మళ్లిస్తామని తెలిపారు.

Traffic Diversion At Uppal Due To IPL Match
Traffic Diversion in Hyderabad Due To IPL Match (ETV Bharat)

Traffic Diversion in Hyderabad Due To IPL Match : ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ - పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు భగాయత్‌ రోడ్డువైపు మళ్లిస్తామని వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

SRH vs Punjab Match : సన్​రైజర్స్ తన​ చివరి మ్యాచ్‌ను పంజాబ్‌ కింగ్స్​తో నేడు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఎస్​ఆర్​హెచ్​ గెలిస్తే పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇది జరగాలంటే కోల్‌కతా నైట్​ రైడర్స్​తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లతో మూడో స్థానంలో, 17 పాయింట్లతో హైదరాబాద్‌ రెండో పొజిషన్​లో కొనసాగుతాయి.

ఐపీఎల్​ సన్​ రైజర్స్​ మ్యాచ్​ టికెట్లు కావాలా? - ఇక్కడ పొందండి! - SRH vs RCB ipl Match Tickets

ఆర్సీబీ ఈసారైనా కప్పు కొట్టేనా? ఐపీఎల్ 2024లో భాగంగా ప్లే ఆఫ్స్​కి చేరే నాల్గో జట్టుపై శనివారం స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోల్​కతా, రాజస్థాన్​, హైదరాబాద్​ టీమ్​లు తమ బెర్తులను ఖాయం చేసుకోగా, నాల్గో ఎంట్రీ కోసం శనివారం బెంగళూరు-చెన్నై తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో ఆర్సీబీ గెలుపొంది, ప్లే ఆఫ్స్​లోకి అడుగుపెట్టింది. తొలి 8 మ్యాచుల్లో ఒకటి నెగ్గి, 7 మ్యాచుల్లో ఓటమిని చవిచూసి ప్లే ఆఫ్స్​ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపించిన కోహ్లీ బృందం, అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో ప్లే ఆఫ్స్​కు చేరుకుంది. చెన్నైతో సమానంగా 14 పాయింట్లే సాధించినప్పటికీ, మెరుగైన నెట్​ రన్​రేట్​ కారణంగా ఆర్సీబీ ముందంజ వేసింది. 2016లో తృటిలో చేజారిన ఐపీఎల్​ ట్రోఫీని బెంగళూరు టీమ్ ఈసారైనా అందుకుంటుందేమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

గుజరాత్​తో మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్​కు హైదరాబాద్ - IPL 2024 GT VS SRH

SRH VS RCB ఐపీల్ మ్యాచ్​ టికెట్లు - ఆ లింక్ క్లిక్​ చేస్తే డబ్బులు మాయం - SRH vs Rcb Fake Tickets

Last Updated : May 19, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.