ETV Bharat / state

రోజుకో మలుపు తిరుగుతున్న రాహిల్ కేసు - ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు - Officers SUSPENDed in RAHEEL CASE

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 7:24 AM IST

Updated : Apr 20, 2024, 7:42 AM IST

EX MLA Shakeel Son Case Updates
EX MLA Shakeel Son Case Updates

EX MLA Shakeel Son Raheel Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్‌ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే జూబ్లీహిల్స్‌లో మరో ప్రమాదం వ్యవహరం చేసినట్లు బయటపడింది. ఆ కేసులోనూ అప్పుడు కేసును దర్యాప్తు చేసిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.

రోజుకో మలుపు తిరుగుతున్న రాహిల్ కేసు

Three Police Officers Suspended in Raheel Accident Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రాహిల్‌ను కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్‌ రూం ఎస్సై, అప్పటి జూబ్లీహిల్స్ సెక్టార్ ఎస్సై చంద్రశేఖర్‌ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సుదర్శన్, చీఫ్ ఆఫీస్ ఐటీసెల్ డీఎస్పీ రాజశేఖర్‌రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Raheel JubileeHills Accident Case : ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీగా, రాజశేఖర్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించగా, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు అధికారుల వాగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డు చేశారు. ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు ఆఫ్రాన్ స్టేట్మెంట్‌ను న్యాయమూర్తి ఎదుట రికార్డు చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే కుమారుడి హిట్​ అండ్​ రన్ కేసు - ఒక్కడిని తప్పించబోయి, 15 మంది నిందితులుగా!

పాతకేసుపై మొదలైన అనుమానాలు : 2022 మార్చి 17న జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రాహిల్‌ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆఫ్రాన్‌ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. స్టీరింగ్ పై వేలిముద్రలు ఆఫ్రాన్‌ వేలి ముద్రలతో సరిపోలాయని పోలీసులు తెలిపారు. కానీ ఇటీవల రాహిల్ తన కారుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతడిని తప్పించేందుకు సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాత కేసుపై అనుమానాలు మొదలయ్యాయి.

ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్​చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు

పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేకదృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి బాధితురాళ్లను తీసుకొచ్చి వాంగ్మూలాలు సేకరించారు. కేసులో రాజీకుదుర్చుకుని వైద్య చికిత్స కోసం రూ.2లక్షలను బాధితురాళ్లకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రాహిల్ స్వయంగా వాహనం నడిపినా కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతడు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పటి అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో నమోదైన కేసు వ్యవహరంలో తనను అరెస్ట్ చేయొద్దని షకీల్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది.

రాహిల్​పై మరో కేసు - జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా నిర్ధారణ - EX MLA Shakeel Son Rahil Case

షకీల్‌ కుమారుడు రాహిల్​కు బిగుస్తున్న ఉచ్చు - పాత కేసు తిరగేస్తున్న పోలీసులు!

Last Updated :Apr 20, 2024, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.