ETV Bharat / state

చోరీ చేయబోతే హుండీలో చేయి ఇరుక్కుపోయింది - Thief hand Stuck in Temple Hundi

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 2:14 PM IST

Updated : Apr 3, 2024, 2:31 PM IST

Thief hand Stuck in Temple Hundi
Thief hand Stuck in Temple Hundi at Kamareddy

Thief hand Stuck in Temple Hundi at Kamareddy : ఓ ఆలయ ఉద్యోగి దొంగ అవతారమెత్తాడు. ఆమ్మవారి హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించగా ఆ దొంగ చేయి హుండీలో ఇరుక్కుంది. ఇంకేం ఉంది రాత్రంతా చేయి బయటకు రావడానికి నానా అవస్థలు పడతూ చివరికి భక్తులకు చిక్కాడు.

Thief hand Stuck in Temple Hundi at kamareddy : అంతా అనుకున్నట్లే జరుగుతోంది. భక్తులు అంతా వెళ్లిపోయారు. గుడి తలుపులు కూడా మూత పడ్డాయి. రాత్రైంది జనసంచారం కూడా లేదు. ఇక ప్లాన్‌ అమలు చేయడమే, చాటుగా ఆలయంలోకి దూరిన ఆ ఆలయ ఉద్యోగి సురేశ్​ కళ్లు పెద్ద హుండీపై పడ్డాయి. ఇంకేముంది దాంట్లో ఉన్న డబ్బంతా తీసుకోవడమే అని సంబరపడ్డాడు. హుండీ పైభాగాన్ని తొలగించాడు. ఇక సొమ్మంతా తీసుకోవడమే అనుకుంటుండగా సురేశ్​ చేయి హుండీలో ఇరుక్కుపోయింది.

ఎంత ప్రయత్నంచినా రాలేదు. పెద్దగా అరవలేక రాత్రంతా గింజుకుంటూ నానా యాతన పడ్డాడు. అమ్మవారి సొమ్ము మీద కళ్లేస్తే, ఆవిడ ఊరుకుంటుందా, ఆ దొంగ తిక్క కుదిర్చింది. తెల్లవారేవరకూ హుండీలో చేయి పెట్టి అలానే ఉండిపోయాడు. ఈలోపు భక్తులు వచ్చి సురేశ్​ అవస్థ గమనించి చేయి బయటకు వచ్చేలా సాయం చేశారు. తర్వాత దొంగను పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి పోచమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆ దొంగ పడిన అవస్థలు పలువురికి నవ్వు తెప్పించింది.

Robbery at Kanaka Durga Temple in Rangareddy : మరో ఘటనలో ఫిబ్రవరి నెలలో ఓ దొంగ అమ్మ వారిని మొక్కి మరీ నగలు చోరీ చేశాడు. ఎవరూ లేని సమయం చూసి ఎంచక్కా ఆలయంలోకి ప్రవేశించిన ఆ దొంగ, అమ్మవారిని మొక్కి దొంగతనం చేశాడు. ఇవన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లుర్‌లోని కనకదుర్గ దేవాలయంలో ఈ ఘటన జరిగింది.

ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ర సహాయంతో కనకదుర్గ అమ్మవారి మెడలో ఉన్న మూడు తులాల మంగళసూత్రాన్ని దొంగ ఎత్తుకెళ్లాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీని ఎవరు చేశారు, స్థానికులా లేక బయటి వ్యక్తులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయ ఉద్యోగి చోరీ చేయబోతే - హుండీలో చేయి ఇరుక్కుపోయింది

'అమ్మా నన్ను క్షమించు.. నీ గుడిలో దొంగతనం చేసినందుకు'

ఆకతాయి ఒక్కడంట చిల్లరంత మూట గట్టి - దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్లలోన దొంగ దొంగ

Last Updated :Apr 3, 2024, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.