ETV Bharat / state

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు - TS Inter Supplementary Exam 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 12:32 PM IST

Telangana Inter Supplementary Exam Date 2024 : మే 24 నుంచి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అలాగే ఈనెల 25 నుంచి మే2 వరకు రీ కౌంటింగ్​, రీ వాల్యుయేషన్​కి దరఖాస్తు చేసుకోవడానికి గడువును విధించింది. ఈసారి ఇంటర్మీడియట్​ ఫలితాల్లో 9.81 లక్షల మందికి గానూ 6.09 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

Telangana Inter Supplementary Exam Date 2024
Telangana Inter Supplementary Exam Date 2024

Telangana Inter Supplementary Exam Date 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్​ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూసిన ఇంటర్​ పరీక్షల ఫలితాలు రానే వచ్చాయి. ఈ పరీక్షలను ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9.81 లక్షల మంది విద్యార్థులు రాయగా, అందులో 6.09 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణతను సాధించారు. మిగిలిన 3.72 లక్షల మంది విద్యార్థులు పెయిల్​ అయ్యారు.

ఇప్పుడు పాస్ కాని విద్యార్థులు, మార్కులు పెంచుకొనే వారి కోసం విద్యాశాఖ రీ కౌంటింగ్​, రీ వాల్యుయేషన్​కి ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్రతి పేపర్​కు రూ.600 రుసుము చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది. ఈ ప్రక్రియ ఆన్​లైన్​లో సాగుతుంది. ఎవరైనా విద్యార్థులు ఫెయిల్​ అయినా, మార్కులు ఇంప్రూవ్​ చేసుకోవాలన్నా సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఎలాంటి సందేశాలు నివృతికి ఈ నెంబరుకు కాల్​ చేయండి : విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్​ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి సందేశాలు ఉన్నా helpdeskie@telangana.gov.in కి మెయిల్​ చేస్తే మీ సందేహాలు నివృత్తి అవుతాయి. లేకపోతే 04024655027కి కాల్​ చేస్తే సరిపోతుంది. కొంత మంది విద్యార్థులు పాసు కాలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని, అలాంటి వారు ఈ ఫలితాలను సీరియస్​గా తీసుకోకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలని విద్యాశాఖ సూచించింది. ఇలాంటి విద్యార్థుల కోసం టెలీమానస్​ అనే సెంటర్​ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ విద్యార్థులకు కావాల్సిన మానసిక ఉత్సాహాన్ని సైకాలజిస్ట్​లు అందిస్తారు.

ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాలు : తెలంగాణ ఇంటర్మీడియట్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో మొదటి సంవత్సరం 60.01 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం 64.19 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. ఈసారి ఫలితాల్లో బాలికలదే పై చేయి. ఇంటర్​ ఫస్టియర్​ ఫలితాల్లో 68.35 శాతం మంది బాలికలు ఉత్తీర్ణతను సాధించగా, సెకండియర్​లో 72.53 శాతం బాలికలు పాస్​ అయ్యారు. మరోవైపు ఇంటర్​ ఫస్టియర్​ ఫలితాల్లో 51.5 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించగా, రెండో ఏడాది 56.1 శాతం మంది పాసు అయ్యారు.

ఇంటర్​ ఫలితాలు 2024​ విడుదల - రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి - TS INTER RESULTS RELEASED 2024

SSC భారీ నోటిఫికేషన్​ - ఇంటర్​ అర్హతతో 3712 పోస్టులు భర్తీ! - SSC Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.