ETV Bharat / state

గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 9:08 PM IST

Group-1 Notification Released
Group-1 Notification Released

Telangana Group-1 Notification Released : రాష్ట్రప్రభుత్వం అదనపు పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చిన కమిషన్‌, పేపర్‌ లీకేజీ కోర్టు కేసులతో పరీక్ష రద్దు చేశారు.

Telangana Group-1 Notification Released : గ్రూప్-1 పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ(TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 2 సార్లు ప్రిలిమ్స్ నిర్వహించగా పేపర్ లీకేజీ, పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో ఆయా పరీక్షలను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల నోటిఫై చేసిన 60 ఉద్యోగాలతో కలిపి మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది.

కొత్త నోటిఫికేషన్ : గ్రూప్‌-వన్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ రద్దుచేసిన కమిషన్‌, కాసేపటికే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈనెల 23 నుంచి 14 వరకు, దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. మే లేదా జూన్‌లో ప్రిలిమ్స్‌, సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మెయిన్స్‌ నిర్వహించనున్నట్టు తెలిపింది.

గవర్నర్​తో ఏపీపీఎస్సీ ఛైర్మన్ భేటీ.. గ్రూప్-1 వివాదంపై చర్చ !

2022 ఏప్రిల్ 26 న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ : నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీచేసింది. అంతకుముందు 2022 ఏప్రిల్ 26 న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్‌ నిర్వహించింది. పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించింది. కానీ.. పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా రెండోసారి పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో టీఎస్‌పీఎస్సీ అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆ విజ్ఞప్తి మేరకు అప్పీలును వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో గ్రూప్‌-1 పాత నోటిఫికేషన్‌ను రద్దుచేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

APPSC Group 1 Fifth Ranker Bhanu Prakash Reddy: తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే గ్రూప్​-1లో ర్యాంక్​: భానుప్రకాశ్​ రెడ్డి

మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే : గ్రూప్‌-వన్‌లో ఇటీవల కొత్తగా 60 పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని కూడా కలిపి మొత్తం 563పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. మే లేదా జూన్‌లో గ్రూప్‌-1 (Group-1) ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో, మెయిన్స్ నిర్వహించనుంది. గత నోటిఫికేషన్‌ రద్దుచేసినందున అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీఎస్‌పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసినా మ‌ళ్లీ చేయాల్సిందేనని తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని కమిషన్ ప్రకటించింది.

గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాలపై స్టే ఇవ్వాలని పిల్... కొట్టివేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.