APPSC Group 1 Fifth Ranker Bhanu Prakash Reddy: తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే గ్రూప్​-1లో ర్యాంక్​: భానుప్రకాశ్​ రెడ్డి

By

Published : Aug 21, 2023, 6:01 PM IST

thumbnail

APPSC Group 1 State Fifth Ranker Bhanu Prakash Reddy: ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌-1 పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. ఐదో ర్యాంకు సాధించిన మిమ్మిడి భానుప్రకాశ్‌రెడ్డి తన సొంత ఊరిలో అడుగుపెట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన భానుప్రకాశ్‌రెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఊర్లో ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకుడు ఇచ్చిన సలహా మేరకు తాను సివిల్స్‌ వైపు ఆసక్తి చూపించానని భానుప్రకాశ్‌ వివరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్‌-1 రాసి విజయం సాధించానన్నారు. చిన్ననాటి నుంచి చదువుపై మమకారం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చినట్లు  భానుప్రకాశ్​రెడ్డి తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక పాఠశాలలోనే విద్యను అభ్యసించి.. అనంతరం  తరువాత జవహర్ నవోదయ విద్యాలయలో 12వ తరగతి వరకు చదివినట్లు వివరించారు. స్థానిక ఉపాధ్యాయుని సూచన మేరకు ఐఏఎస్ సాధించాలనే ఉద్దేశంతోనే..  హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. అనంతరం దిల్లీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు భానుప్రకాశ్‌ వెల్లడించారు.. రోజుకు 18 గంటలపాటు చదువుపైనే ధ్యాస ఉండేదని వెల్లడించారు. తన సోదరుడుతో పాటుగా... తల్లిదండ్రులకు ప్రోత్సాహంతో సివిల్స్​లో ర్యాంకు సాధించానని పేర్కొన్నాడు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.