ETV Bharat / state

ప్రజా ఆస్తులను చట్టబద్దంగా హస్తగతం చేసుకునేందుకే 'భూయాజమన్య హక్కు చట్టం'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 9:57 PM IST

TDP Supports Lawyers Protest Against Land Rights Act: వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆస్తులను చట్టబద్ధంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం తెచ్చిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరాహారదీక్ష చేపట్టారు. న్యాయవాదులకు టీడీపీ నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు.

_lawyers_protest.
_lawyers_protest.

TDP Supports Lawyers Protest Against Land Rights Act: రాష్ట్రంలో ప్రజా ఆస్తులను చట్టబద్ధంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చిందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీనియర్ న్యాయవాదులు చెరుకురి శ్రీపతిరావు, చలసాని అజయ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మాన్ని పక్కనపెట్టి పరిపాలన సాగిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చట్టంపై నిర్ణయం మార్చుకోవాలని కోరారు.

భూ హక్కు చట్టంపై లాయర్ల నిరసనలకు టీడీపీ మద్దతు - అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ

జీవో 512తో సామాన్యుల కన్నా వైసీపీ నేతలకే లబ్ధి - రద్దు చేయాలని న్యాయవాదుల ఆందోళన

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. 43వ రోజు చేపట్టిన దీక్షలో సీనియర్ న్యాయవాదులు చెరుకూరి శ్రీపతిరావు, అజయ్ కుమార్ దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న న్యాయవాదులకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్ రావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న న్యాయవాదులకు నేతలు పుష్పాలను అందజేశారు.

భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

ప్రజల భూములను హరించనున్న భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములపై అధికారులకు పెత్తనం ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటివరకు భూతగాదాలను సివిల్ కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటున్నారు ఈ చట్టంతో ఆర్డీవోకు అధికారం వస్తుందన్నారు. ఎవరైనా ల్యాండ్ తమదని పిటిషన్ వేస్తే రెవెన్యూ అధికారులు విచారణ చేసి పరిష్కరిస్తారన్నారు. దీంతో భూ యజమానికి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందని తెలిపారు. వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఓటుతో ఈ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు.

చీకటి జీవో 512ను రద్దు చేయాలి - న్యాయవాదుల నిరసన

ఈ చట్టం క్రూరమైనదని సీనియర్ న్యాయవాదులు శ్రీపతిరావు, చలసాని అజయ్ మండిపడ్డారు. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఇవ్వని భూ యాజమాన్య హక్కు చట్టంలోని లోగుట్టును అందరికి అర్థమయ్యేలా చైతన్యం చేస్తామని న్యాయవాదులు ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల ఆస్తి హక్కుకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పించే పేరుతో వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిన విధానం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధిక్కరించినట్టే కనిపిస్తోందన్నారు. అడ్డగోలుగా చట్టాన్ని చేసినట్లు అర్థమవుతోందన్నారు. పట్టాదార్‌ పుస్తకాల్లో, సర్వే రాళ్లపైనా జగన్‌ బొమ్మ ఏమిటని నిలదీశారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యాయవాదులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.