జీవో 512తో సామాన్యుల కన్నా వైసీపీ నేతలకే లబ్ధి - రద్దు చేయాలని న్యాయవాదుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 10:05 PM IST

thumbnail

Land Rights Act in AP : భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ కర్నూలులో 16వ రోజు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్నూలు ధర్నా చౌక్​ వద్ద లాయర్లు సంతకాల సేకరణ చేపట్టారు. ఎలాంటి చర్చల్లేకుండానే ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో చీకటి జీవోను తీసుకువచ్చిందని లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 512ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

Lawyers Protest to Repeal the Land Rights Act : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన భూ హక్కు చట్టం ద్వారా చిన్న, సన్నకారుల రైతులు నష్టపోతారని లాయర్లు తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ద్వారా భూ వివాదాల సమస్యను కోర్టు దృష్టికి తీసుకు రాకుండా జిల్లాకు ఒక ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేసి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజల కన్నా వైసీపీ నేతలకే ఎక్కువగా లబ్ధి చేకూరేలా ఉందని ఆరోపించారు. భూ కబ్జాదారులకు అనుకూలమైన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. జీవో 512ను రద్దు చేసే వరకు పోరాడుతామని హెచ్చారించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.