ETV Bharat / state

కామారెడ్డిలో వరుస మృతదేహాల కలకలం - భయాందోళనలో స్థానికులు - Series Murders Noticed in Kamareddy

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 10:11 PM IST

Series Murders Noticed in Kamareddy : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు, బాలుడి మృత దేహాలు లభ్యంకావడం కలకలం సృష్టించింది. వారివి హత్యలా, ఆత్మహత్యలా? అనే విషయాన్ని తేల్చడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మృతదేహాలు లభ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనంలో రెండు మృతదేహాలు, అటవీ ప్రాంతంలో మరో మహిళ మృతదేహం లభ్యమయ్యాయి.

Series Murders Noticed in Kamareddy District
Suspect Murder Cases in Kamareddy (ETV Bharat)

Suspect Murder Cases in Kamareddy District : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వరుస మృతదేహాల లభ్యం కలకలం రేపింది. ఒకసారి రెండు, మరోసారి ఒక మృతదేహం లభించడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈనెల 19న బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయంలో ఓ మహిళ, బాలుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటికే రెండు మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తు పట్టలేనంతగా మారున్నాయి.

వీరివి హత్యలా, ఆత్మహత్యలా? : పోలీసులు రెండు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పంచనామా జరిపించారు. మహిళకు 30 నుంచి 35 ఏళ్లు ఉండగా, బాలుడికి 6 నుంచి 8 ఏళ్ల వయస్సు ఉండవచ్చని పోలీసులు అంచన వేస్తున్నారు. కానీ వారిది హత్య? లేక ఆత్మహత్యా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోయారు. మృతుల సంబందీకులు మాత్రం తమ వారిది హత్యేనని అనుమానాలు వ్యక్తం చేశారు.

"ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నవారు కనిపించకుండా, ఆచూకీ లభించకుంటే మా పోలీస్​ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేయండి. మృతుల ఆనవాళ్లతో ఏవైనా సరిపోలితే ఒకసారి గమనించగలరు. చనిపోయిన మహిళ గోదుమ, నలుపు రంగు దుస్తులు ధరించి ఉంది. అదేవిధంగా ఆ బాలుడు ఆకుపచ్చ టీ షర్ట్​ వేసున్నాడు."-కృష్ణ, బాన్సువాడ పట్టణ సీఐ

Locals Worried After Finding 3 Dead Bodies : రెండు మృతదేహాలు లభ్యం ఘటన మరువక ముందే బాన్సువాడ వాసులను ఆందోళనకు గురి చేసేలా మరో మృతదేహం రోజుల వ్యవధిలోనే లభించింది. ఈనెల 23న మండలంలోని కృషానగర్ తండా సమీపంలోని అటవీప్రాంతంలో బూర్గుల్ గ్రామానికి చెందిన కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్న లక్ష్మీ (37) అనే మహిళ మృతదేహం పోలీసులకు లభించింది.

ఆమె మృతదేహం కూడా పూర్తిగా కుళ్లి పోయి కనిపించింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ సైతం సంఘటనా స్థలాన్ని వచ్చి పరిశీలించారు. తల పగిలి, దవడ విరిగినట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మీని హత్యచేసి అటవీ ప్రాంతంలో పడేసినట్లు, మృతురాలి బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం వ్యవధిలోనే ఇద్దరు మహిళలు, బాలుడు అనుమానాస్పదంగా మృతి చెండడం బాన్సువాడలో చర్చనీయాంశమైంది. బాన్సువాడలో చాలావరకు సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో, ఈ ఘటనలు పోలీసులకు సవాల్​గా మారాయి.

తీవ్రంగా గాయపర్చి - ఆపై ఉరి వేసి - వివాహేతర బంధానికి అడ్డొస్తుందని మైనర్​ బాలికపై కన్నతల్లి హత్యాయత్నం - Mother Tried to kill her Daughter

కట్టుకున్న భార్యను కనికరం లేకుండా కడతేర్చి - ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి - Man killed His Wife In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.