ETV Bharat / state

టిప్పర్​ లారీ బోల్తా - అందులోని మట్టి మీదపడి ఇద్దరు యువతులు, ఓ యువకుడి మృత్యువాత - Road Accident In Karimnagar

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 9:01 AM IST

Road Accident In Karimnagar : హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి అందులో ఉన్న మట్టి మీద పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో చోటుచేసుకుంది.

Karimnagar Road Accident
Road Accident In Karimnagar

Road Accident In Karimnagar : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని బోర్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బోర్నపల్లి గ్రామానికి చెెందిన వర్ష (15), గంట విజయ్‌ (17), గంట సింధూజ (18) గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు. జాతర ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్​కు మట్టితో ట్రక్కు బయలుదేరింది.

దేవుడి దర్శనానికి వెళ్తుండగా ఆటోను ఢీకొట్టిన ట్రక్కు- ఐదుగురు భక్తులు దుర్మరణం - UP Road Accident

Karimnagar Road Accident : అక్కడి నుంచి అతి వేగంతో వచ్చి బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హుజూరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్‌, సింధూజ ఇద్దరు మృతి చెందారు. వర్ష చికిత్స పొందుతూ చనిపోయింది.

సమాచారం అందుకున్న మృతుల కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కన్నబిడ్డల మృతదేహాలను చూసి గుండెలవిసేలా విలపించారు. టిప్పర్‌ లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులు విజయ్‌, వర్ష ఇద్దరు అన్నాచెల్లెళ్లు. సింధూజ వరుసకు అక్క అవుతుందని గ్రామస్థులు వివరించారు. విజయ్‌ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, వర్ష పదో తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు. సింధూజ డిగ్రీ చదువుతున్నట్లు స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రహదారి ప్రమాదంలో మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - పలువురికి గాయాలు - RTC Bus Accident in Peddapalli

టైలర్​ షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.