ETV Bharat / state

'మ్యాచ్‌కు 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతి - ఎవరూ వాటిని తీసుకురావొద్దు' - srh vs mi ipl match 2024 uppal

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 7:15 PM IST

Updated : Mar 26, 2024, 9:30 PM IST

TSRTC Sajjanar on IPL Match Buses
SRH vs MI IPL Match 2024 Hyderabad

SRH vs MI IPL Match 2024 Hyderabad : ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. స్టేడియం లోపల, వెలుపల పోలీసులను భారీగా మోహరిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే ఎలాంటి వస్తువులను తీసుకురావొద్దని క్రికెట్​ లవర్స్​కు సూచించారు.

SRH vs MI IPL Match 2024 Hyderabad : బుధవారం రాత్రి హైదరాబాద్​లో జరగబోయే ముంబయి ఇండియన్స్​, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్​హెచ్ (SRH) హోమ్​ గ్రౌండ్, ఉప్పల్‌ వేదికగా జరగబోయే తొలి మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని, వాటర్‌ బాటిల్స్‌, బ్యానర్స్‌, ల్యాప్‌ ట్యాప్‌, లైటర్స్‌, సిగరెట్స్‌, బైనాక్యులర్స్‌ నిషేధమని ఆయన స్పష్టం చేశారు. బ్లూ టూత్స్ అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం లోపల తక్కువ ధరలకే తనుభండారాలు, త్రాగునీరు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

ఎందుకంత ఓవరాక్షన్ బ్రో - కోల్​కతా స్టార్​కు భారీ జరిమానా - IPL 2024 SRH Vs KKR

మ్యాచ్ కోసం 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని సీపీ వివరించారు. 39 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న స్టేడియం లోపల, 360సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారని, వీటిని కమాండ్‌కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి కదలికను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. స్టేడియం వద్ద బ్లాక్‌ టికెట్స్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీమ్స్‌ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉంటారన్నారు.

"హైదరాబాద్​లో జరగబోయే ముంబయి ఇండియన్స్​, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తొలి ఐపీఎల్ మ్యాచ్​కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతిస్తాము. స్టేడియంలోకి ఎటువంటి వస్తువులకు అనుమతి లేదు. స్టేడియం వద్ద బ్లాక్‌ టికెట్స్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్టేడియం పరిసర ప్రాంతాల్లో షీ టీమ్స్‌ ఉంటారు". - తరుణ్ జోషి, రాచకొండ పోలీస్ కమిషనర్

మ్యాచ్‌కీ 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతి రాచకొండ సీపీ

టీఎస్​ ఆర్టీసీ స్పెషల్​ బస్సులు : ఐపీఎల్​ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరగబోయే ముంబయి ఇండియన్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌కు ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మైదానానికి 60 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డపనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇవి బుధవారం సాయంత్రం 6 గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై, మ్యాచ్‌ అనంతరం తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని, మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్‌ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

సన్​రైజర్స్ మ్యాచ్​ - క్షణాల్లో మారిపోయిన కావ్య ఎక్స్​ప్రెషన్స్ - Kavya Maran SRH

రూ.24 కోట్ల బౌలర్​ను బెంబేలెత్తించిన సన్​రైజర్స్! - IPL 2024

Last Updated :Mar 26, 2024, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.