ETV Bharat / state

'వైసీపీ పాలనలో విశాఖ - గంజాయే కాదు అంతర్జాతీయ డ్రగ్స్ కేంద్రంగా మారింది' - Visakha Drug Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 7:13 PM IST

Opposition Leaders on Visakha Drug Case: రిటైర్మెంట్ అనంతరం విశాఖలో జీవించాలని చాలామంది కోరుకుంటారని కానీ ఇప్పుడు అదే ప్రశాంతమైన నగరం దారుణమైన హింసకు ప్రతిరూపంగా మారిందని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గంజాయికి నిలయంగా ఉన్న విశాఖ నేడు డ్రగ్స్​కి క్యాపిటల్​గా మారిపోయిందని అన్నారు.

visakha_drug_case.
visakha_drug_case.

Opposition Leaders on Visakha Drug Case: ఉక్కు నగరం చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు బిగిసింది. విశాఖ తీరానికి బ్రెజిల్‌ నుంచి 25 వేల కిలోల డ్రగ్స్‌ దిగుమతి కావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో పట్టుకున్న సీబీఐ సంధ్య ఆక్వా పరిశ్రమలో విస్తృతంగా సోదాలు జరిపింది. సిటీ ఆఫ్ డెస్టినేషన్‌గా ఉన్న విశాఖను సిటీ ఆఫ్‌ డ్రగ్స్‌గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

డ్రగ్స్​ కంటైనర్ మా పరిధిలోకి రాదు - మా వల్ల సోదాలు ఆలస్యం కాలేదు: విశాఖ సీపీ - VISAKHA CP ON DRUGS CASE

Jana Sena Corporator Pithala Murthy Yadav Comments: విశాఖను మత్తు రాజధానిగా మార్చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య ఆక్వా కంపెనీకు తాడేపల్లి ప్యాలెస్​కు లింక్ ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకు గంజాయి మాత్రమే విశాఖలో దొరికేది కానీ ఇప్పుడు ఇతర దేశాల నుంచి నేరుగా భారీ స్థాయిలో డ్రగ్స్ వస్తున్నాయని అన్నారు. విశాఖను గంజాయి రాజధానిగానే కాదు అంతర్జాతీయ డ్రగ్స్ రాజధానిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ కంటైనర్​ను దిగుమతి చేసుకున్న వారు, చేయించిన వారు వైఎస్సార్​సీపీ నేతలేనని ఆరోపించారు. వైసీపీ నేతలను డ్రగ్స్ తనిఖీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండి పడ్డారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడికి రవాణా అవుతోంది ఎవరికి దగ్గరకు వెళ్లడానికి అవకాశం ఉంది అనే కోణంలో దర్యాప్తు చేయాలని మూర్తి యాదవ్ అన్నారు.

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీ నేతల పాత్ర ఏంటి - కంటైనర్​ తెరవకుండా యత్నించారా? - YCP LEADERS IN VIZAG DRUGS CASE

TNSF State President MV Pranav Gopal Comments: రాష్ట్రంలో భారీ స్థాయిలో డ్రగ్స్ సరఫరా అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ప్రశ్నించారు. ఒకప్పుడు సింగపూర్ లాంటి నగరాలు డ్రగ్స్ సిటీగా ఉంటే ఇప్పుడు విశాఖ నగరంలో కూడా అదే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైసీపీ నేతలు కచ్చితంగా దీన్ని వెనక ఉన్నారని అన్నారు. మొన్న ఎంపీ ఎంవీవీ కుటుంబంపై మీద దాడి జరిగిందని తాజాగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ సతీమణిని కత్తితో భయపెట్టి పట్టపగలే దొంగతనం చేశారని అన్నారు. అంటే విశాఖలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తోందని అన్నారు.

విద్యుత్​ బకాయిలు చెల్లించండి - విశాఖ ఉక్కు పరిశ్రమకు నోటీసులు - Visakha steel industry

ప్రభుత్వంపై విశాఖ వాసులు ఆగ్రహం: ప్రశాంతమైన విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను మత్తుకు బానిస చేసి ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేయించుకోవడానికి 25 వేల కిలోల డ్రగ్స్‌ తీసుకొచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాదకద్రవ్యాల రాకెట్‌పై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు.

'వైసీపీ పాలనలో విశాఖ - గంజాయే కాదు అంతర్జాతీయ డ్రగ్స్ కేంద్రంగా మారింది'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.