ETV Bharat / state

పనిలేక చేనేత కార్మికుల అవస్థలు - నిలిచిన బతుకమ్మ చీరల తయారీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 4:04 PM IST

No Work for Handloom Workers in Telangana : చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు తలపెట్టిన బతుకమ్మ చీరల తయారీ నిలిచిపోయింది. గతంలో నేసిన చీరల బిల్లుల బకాయిలు కోట్లలో నిలిచిపోవడం నేతన్నల పాలిట శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరమగ్గాలపై చీరలు ఉత్పత్తి చేయగా కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం చేనేతతోనూ చీరలు ఉత్పత్తి చేశారు. బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితి లేక ముడిసరుకు కొందామంటే కొత్త అప్పు పుట్టక, ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. చేనేత వృత్తినే నమ్ముకున్న కార్మికులు పూడగడవక పస్తులుండే దుస్థితి నెలకొంది.

Handloom Workers Facing Problems For Unemployment
No Work for Handloom Workers in Telangana

పనిలేక చేనేత కార్మికుల అవస్థలు - నిలిచిన బతుకమ్మ చీరల తయారీ

No Work for Handloom Workers in Telangana : ఆరేళ్లుగా బతుకమ్మ చీరల (Bathukamma sarees) తయారీతో చేనేత కార్మికులు, యజమానులు ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. ఏడాదిలో 6 నుంచి 9 నెలలపాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తుండగా మిగతా సమయంలో తువ్వాలలు, లుంగీలు, కాటన్‌ చీరలు, ఇతరత్రా దుస్తుల తయారీతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. గతేడాది తయారు చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ మంజూరు కాక మరమగ్గాల యజమానులు దుస్తుల తయారీ పనులు నిలిపివేశారు. మరమగ్గం (Mara Maggam Works) ఆగిపోగా చేనేత కార్మికులు తమ జీవనాధారం కోల్పోయి అల్లాడిపోతున్నారు.

మరో పని చేసే నైపుణ్యం కరవై అరకొర ఆదాయంతో భారంగా బతుకులీడుస్తున్నారు. చేతినిండా పని దొరికినపుడు రోజుకు 800 నుంచి వెయ్యి వరకు సంపాదించిన కార్మికులు ప్రస్తుతం పనుల్లేక కేవలం 200తో సంసారం నెట్టుకొస్తున్నారు. రాజన్న సిరిసిల్ల తర్వాత కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి, చొప్పదండి, కొత్తపల్లి గ్రామాల్లో వందలాది కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, బతుకమ్మ బకాయిల కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. రోజురోజుకి కుటుంబం గడవటం కష్టంగా మారిందని వాపోతున్నారు.

2022 సంవత్సరానికి సంబంధించిన బతుకమ్మ చీరల డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వలస పోవడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. చేనేత వస్త్రాలను నష్టానికి అమ్ముకుంటున్నాం. దీని మీద ఆధారపడిన వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను - చేనేత కార్మికుడు

Handloom Workers Facing Problems For Unemployment : కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో గతేడాది 32 లక్షల మీటర్ల బతుకమ్మ చీరల తయారీకి అవకాశం కల్పించారు. విడతల వారీగా 36 శాతం నిధులు మాత్రమే విడుదల చేశారు. మూడు జిల్లాల పరిధిలో ఇంకా 8 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో యజమానులు మరమగ్గాలు ఆపేశారు. కార్మికులకు పనుల్లేక పస్తులు ఉండాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఈ ఏడాదికిగాను బతుకమ్మ చీరల తయారీకి జనవరిలోనే ఆర్డర్‌ రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడక ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వం మారడం వల్ల కొంత జాప్యం జరుగుతోందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. పెండింగు బిల్లులు చెల్లించి బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియ గతంలో లాగా కొనసాగించాలని కార్మిక కుటుంబాలు వేడుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు ఆర్డర్‌ వస్తే ఎలాంటి వస్త్రం తయారు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కార్మికులు చెబుతున్నారు. కాంగ్రెస్‌(Congress)ప్రభుత్వం విధి విధానాల ఖరారు చేశాక. బతుకమ్మ చీరల ఉత్పత్తికి అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

డెక్కన్ హాట్ ఎగ్జిబిషన్​లో ఆకట్టుకున్న చేనేత, హస్త కళాకృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.