ETV Bharat / state

పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్​పై విచారణ జరపాలి- NHRCకి కూటమి నేతల ఫిర్యాదు - NDA Complaint to NHRC on AP CS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 6:58 PM IST

NDA Leaders Complaint to NHRC on AP CS: ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలంటూ కేంద్ర మానవ హక్కుల సంఘానికి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ తీసుకున్న నిర్ణయం కారణంగా 33 మంది మరణించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు.

NDA_Leaders_Complaint_to_NHRC_on_AP_CS
NDA_Leaders_Complaint_to_NHRC_on_AP_CS

NDA Leaders Complaint to NHRC on AP CS: ఆంధ్రప్రదేశ్​లో పెన్షన్ల పంపిణీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైసీపీ తీరు కారణంగా 33 మంది పెన్షనర్లు చనిపోయారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాజాగా కూటమి నేతలు ఈ విషయాన్ని కేంద్ర మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి (National Human Rights Commission) టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 33 మంది వృద్ధులు మరణించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC) దృష్టికి కూటమి నేతలు తీసుకెళ్లారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో 33 మంది చనిపోయారు - ఈసీకి చంద్రబాబు లేఖ - Chandrababu writes to EC

కదల్లేని వారినీ సచివాలయాలకు రావాలని వైసీపీ ప్రచారం చేసిందని నేతలు ఆరోపించారు. కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అధికార వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్‌పై (Chief Secretary) చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా సీఎస్‌ను ఆదేశించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేలా చూడాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కూటమి నేతలు విన్నవించారు.

పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్​పై విచారణ జరపాలి- NHRCకి కూటమి నేతల ఫిర్యాదు

ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కారణంగా సుమారుగా 33 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం శవాలతో రాజకీయాలు చేసే సంస్కృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెన్షన్ల శవాలను కూడా అడ్డంపెట్టుకుని ఇందులో రాజకీయం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఇది మానవ హక్కులు ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వచ్చి వినతి పత్రం ఇచ్చాము. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. మా ఫిర్యాదుపై చర్యలు చేపడతామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ హామీ ఇచ్చారు. - కనకమేడల రవీంద్ర కుమార్, టీడీపీ నేత

పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేశారు - సీఈవోకు సీఎఫ్​డీ ఫిర్యాదు - CFD Complaint on Pensions Delay

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.