ETV Bharat / state

కవిత ఈడీ కేసు మరోసారి వాయిదా - ఈనెల 28న విచారణ​

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 5:34 PM IST

Updated : Feb 16, 2024, 9:53 PM IST

MLC Kavitha ED Case Postponed : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఈ క్రమంలో కేసును మరోసారి వాయిదా వేసింది.

MLC Kavitha ED Case Postponed
MLC Kavitha Liquor Scam Case

MLC Kavitha ED Case Postponed : బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. మద్యం కేసులో సమన్ల జారీని సవాల్‌ చేస్తూ కవిత వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం ధర్మాసనం(Supreme Court) విచారణ జరిపింది. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లకు జతచేసిన కోర్టు, ప్రస్తుతం 3 పిటిషన్లపై వేర్వేరుగా విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

మూడు వేర్వేరు కేసులను కలిపి విచారణ చేయడం సబబు కాదని పేర్కొంది. ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. మహిళల విచారణ వేళ సీఆర్‌పీసీ చట్టం ఉల్లంఘిస్తున్నారన్న కవిత, తదుపరి ఆదేశాల వరకు తనపై చర్యలు లేకుండా చూడాలని పిటిషన్​ దాఖలు చేసింది. దిల్లీ మద్యం కేసులో విచారణకు రావాలని ఆమెకు పలుమార్లు ఈడీ నోటీసులు(ED Notices) ఇచ్చిన విషయం విదితమే.

ED investigation in Delhi Liquor Case : దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో నేటికీ కొలిక్కిరాని ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతునే ఉన్నాయి. గవర్నమెంట్​ ఆదాయానికి గండికొట్టి అక్రమార్జనకు పాల్పడేందుకు దిల్లీ మద్యం విధానాన్ని కొందరు నేతలు ఒక ఆయుధంలా వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. వేల కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేయడానికి నిందితులు తమ చరవాణులను(Mobiles) సైతం ధ్వంసం చేశారని స్థానిక న్యాయస్థానంలో నాడు ఈడీ వివరించింది.

Supreme Court on MLC Kavitha Petition : ఇప్పుడే ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేయొద్దు.. ఈడీకి సుప్రీం కోర్టు ఆదేశం

ఈ మద్యం పాలసీలో ఉద్దేశపూర్వక లొసుగులతో విధానాన్ని రూపొందించారని, అక్రమ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారని పేర్కొంది. ఆప్‌ నేతల నేరపూరిత కుట్రవల్ల అనైతిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించిందని వెల్లడించింది. ఆప్‌ నేతల ప్రయోజనాల కోసం దిల్లీ ప్రభుత్వం రూ.581 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. లైసెన్సు ఫీజులు(License Fees) సహా అన్నింటి రూపేణా రూ.2,873 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోయిందని ఈడీ పేర్కొంది.

South Group Involved in Delhi Liquor Scam : మద్యం కేసులో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ శరత్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల నియంత్రణలో ఉన్నట్లు ఈడీ నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణంలో పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. హోల్​సేలర్స్‌కు(Wholesalers) ఇచ్చిన 12% ప్రాఫిట్‌ మార్జిన్‌లో అర్ధభాగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు ముడుపుగా అప్పగించడానికి కేటాయించినట్లు తెలిపింది.

ఈడీ దర్యాప్తు ప్రకారం విజయ్‌ నాయర్‌ ఆప్‌ నాయకుల తరఫున కనీసం రూ.100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్‌ నుంచి అమిత్‌ అరోడాతోపాటు వివిధ వ్యక్తుల ద్వారా అందుకున్నారని, ఆ విషయాన్ని అరెస్ట్‌ అయిన అమిత్‌ అరోడా తన స్టేట్‌మెంట్ల ద్వారా వెల్లడించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను పలుమార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

లిక్కర్ కేసులో సమన్లకు స్పందించని కేజ్రీవాల్‌- కోర్టులో ఈడీ ఫిర్యాదు

'దిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు'- కేజ్రీ సంచలన ఆరోపణలు

Last Updated : Feb 16, 2024, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.