ETV Bharat / state

వేడి నీటి వల్లే విద్యార్థినికి బొబ్బలు - యాసిడ్ ​దాడి జరిగిందనేది తప్పుడు ప్రచారం : ఐ​సీఎఫ్ఏఐ వీసీ - ICFAI VC On Hostel Incident

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 4:03 PM IST

ICFAI VC On Hostel Incident : ఐ​సీఎఫ్ఏఐ విశ్వవిద్యాలయంలో ఓ యువతికి అనునాస్పద రీతీలో గాయలవ్వడంపై మీడియాలో వచ్చిన కథనాలపై ఆ విశ్వవిద్యాలయ ఉపకులపతి స్పందించారు. యువతిపై యాసిడ్​ దాడి జరగలేదన్నారు. వేడినీళ్ల వల్లే విద్యార్థినికి గాయాలయినట్లు తాము భావిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ డా.ఎల్​.ఎస్​ గణేష్ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

ICFAI VC On Hostel Incident
ICFAI VC On Hostel Incident (ETV Bharat)

ICFAI VC On Hostel Incident : ఐ​సీఎఫ్ఏఐ యూనివర్సిటీలో యువతికి అనుమానాస్పద రీతిలో గాయలవడంపై విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్. ఎల్​ఎస్ గణేష్​ ప్రెస్​మీట్ నిర్వహించారు. లా చివరి సంవత్సరం చదువుతున్న లేఖ్య వర్ధిత విషయంలో పలు మీడియా సంస్థలు యాసిడ్ అని చూపించాయని అవి తప్పుడు ప్రచారమని తెలిపారు. యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలు ఉన్నాయన్న వీసీ, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటన వేడి నీళ్ల వళ్లే జరిగిందని యూనివర్సిటీ యాజమాన్యం భావిస్తున్నట్లుగా తెలిపారు.

VC Clarifies On Hostel Incident : ఐ​సీఎఫ్ఏఐ వసతిగృహ సమీపంలో ఎలాంటి యాసిడ్ అందుబాటులో లేదని వివరించారు. గర్ల్స్ హాస్టల్లో పటిష్ఠ భద్రత ఉంటుందని అమ్మాయి తప్ప వేరే వాళ్లు ఎవరూ ఆమె గదిలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. యువతి బాత్రూంలో స్నానం చేసిన తర్వాత తనంత తానే బయటకు వచ్చి ప్రాథమిక చికిత్స కోసం యూనివర్సిటీ క్లినిక్​కు వెళ్లిందని తెలిపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించినట్లు వెల్లడించారు.

Suspicious Death in Jagtial District : అక్క అనుమానాస్పద మృతి.. చెల్లి అదృశ్యం.. జగిత్యాల జిల్లాలో మిస్టరీ

క్లూస్​టీం వివరాలు సేకరించింది : యువతి చదువుల్లో ముందుంటుందని మానసికంగా శారీరకంగా ఇలాంటి ఇబ్బందులు లేవని వీసీ పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం ఘటన జరిగిన తర్వాత యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్న అధికారులు క్లూస్ టీం ఆ రోజు విచారణ చేపట్టి బకెట్ వాటర్​తో పాటు అక్కడున్న వస్తువుల్ని తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి సమగ్రంగా విచారణ జరిగిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని అన్నారు. కాగా యువతి స్వస్థలం తిరుపతి అని తెలిపారు.

"గాయపడిన లేఖ్య వర్థిత అనే విద్యార్థిని 7:20కి రూం నుంచి బయటకు వచ్చి తన ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పింది. వెంటనే ఆమెకి మా క్లినిక్​లో చికిత్స అందించాం. అనంతరం ఓ మంచి ఆసుపత్రికి వైద్యం కోసం తరలించాం. యువతిపై యాసిడ్​ దాడి జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం. యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలున్నాయి. లేఖ్యకు గతంలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవు. కారిడార్లో సీసీటీవీ విజువల్స్ పోలీసులకు అందించాము. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు"- డాక్టర్​ ఎల్​. ఎస్​. గణేశ్​, ఐ​సీఎఫ్ఏఐ వీసీ

నీళ్లు అనుకొని యాసిడ్ కలిపిన నీటిని తనపై పోసుకున్న ఐసీఎఫ్​ఏఐ విద్యార్థినికి గాయాలు - ICFAI student sustains burn injurie

Bike Accident Viral Video in Adilabad : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్.. ప్రమాదవశాత్తు మీద పడిన యాసిడ్.. ఆ తర్వాత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.