ETV Bharat / state

2018 గ్రూప్-1 రద్దుపై హైకోర్టు స్టే - HC Stay on Group 1 Cancellation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 3:35 PM IST

HC Stay on APPSC 2018 Group-1 Examination : ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లాయి. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉద్యోగంలో ఉన్నవారికి యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

APPSC Group-1 Examination
APPSC Group-1 Examination

HC Stay on APPSC 2018 Group-1 Examination : 2018లో నిర్వహించిన గ్రూప్-1 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పీల్​కు వెళ్లాయి. ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై, ఏపీ హైకోర్టు పాక్షికంగా స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

న్యాయబద్ధంగా లేవని : ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. 2018 గ్రూపు-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. జవాబుపత్రాల మూల్యాంకనానికి వైసీపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ న్యాయబద్ధంగా లేవని స్పష్టంచేశారు.

యథాస్తితి కొనసాగుతుంది : ఈ క్రమంలో మెయిన్స్ అనర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేసింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యోగంలో ఉన్నవారికి యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

రాజకీయ పునరావాస కేంద్రంలా ఏపీపీఎస్సీ- గ్రూప్1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

2016కు ముందు ఇలా : ఏపీపీఎస్సీ 36/2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను అనుసరించి ప్రధాన పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన మార్కులను జాబితా రూపంలో ప్రకటించింది. అందులో అభ్యర్థుల రోల్‌ నెంబరు, కమ్యూనిటీ, ఒక్కో సబ్జెక్టులో 150కి వచ్చిన మార్కుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించింది. నిరుద్యోగులకు సానుకూలంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించేది.

2018లో మారిన పరిణామాలు : 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్‌ ప్రాథమిక 'కీ' వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని అప్పట్లో ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రత్యేకంగా మెమొరాండం అనేది ఉండదని పేర్కొంది. అయితే, 2018 నోటిఫికేషన్‌ ద్వారా నియామకాల్లో ఎంపికైన, మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు ఇంతవరకూ చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వారికి కోర్టు కేసు ఉందని కమిషన్‌ సమాధానమిస్తోంది.

గ్రూప్-1 అక్రమాలపై ప్రతిపక్షాల ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.