ETV Bharat / state

విష్ణుపురం వద్ద రైల్వే ట్రాక్​ పనులు పూర్తి - యధావిధిగా రైళ్ల రాకపోకలు - Goods Train Derails AT Vishnupuram

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 9:33 PM IST

Railway Track Restoration Works : నల్గొండ జిల్లాలోని విష్ణుపురం వద్ద ఓ గూడ్స్​రైలు పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్​- గుంటూరు మార్గంలో రైళ్ల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన రైల్వే సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ట్రాక్​ పునరుద్దరణ పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. అంతకుముందు సికింద్రాబాద్​- గుంటూరు మార్గంలో పలు రైళ్ల వేళల్లో మార్పులను చేశారు అధికారులు.

Railway Track Restoration Works
Railway Track Restoration Works (ETV Bharat)

Railway Track Restoration work AT vishnupuram : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్​రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే అధికారులు కొన్నిరైళ్లను దారిమళ్లించారు. మరికొన్ని రైళ్ల టైం షెడ్యూల్​ను మార్చారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్​ పునరుద్దరణ పనులను చేపట్టిన రైల్వే సిబ్బంది విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో అధికారుల సూచనల అనంతరం రైళ్లు యథావిధిగా నడవనున్నాయి.

The Crew Successfully Repaired The Railway Track : రైల్వే శాఖలోని అన్ని విభాగాలకు చెందిన కార్మికులు, అధికారులు, ఇంజనీర్లు సంయుక్తంగా దాదాపు ఐదున్నర గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను సమర్థవంతంగా నిర్వహించారు. కొద్దిసేపట్లో రైల్వే ట్రాక్ పటిష్టతపై రైల్వే ఇంజనీరింగ్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరి కొండ్రపోల్ స్టేషన్లో నిలిచి ఉంది. అధికారుల ఆదేశాల అనంతరం శబరి ఎక్స్ప్రెస్ కాసేపట్లో బయలుదేరనుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కొంత ఆలస్యమైనా యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ పునరుద్ధరించారు శబరి ఎక్స్​ప్రెస్​ రైల్వే స్టేషన్​లో కొన్ని గంటలు నిలిపి ఉండటంతో పిల్లలు మహిళలు వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

ప్రయాణీకులకు తప్పని ఇబ్బందులు : శబరి ఎక్స్​ప్రెస్​లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్నపిల్లలు, మహిళలు మంచినీళ్లకు ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో రైలు ఎప్పుడు ముందుకు వెళ్తుందా? అని ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిల్లలకు బిస్కెట్లు,మంచినీళ్లు అందించి తన తన చేయూతనందించారు. అదేవిధంగా సికింద్రాబాద్ గుంటూరు మార్గమధ్యలో ప్రయాణించే విశాఖ తదితర ఎక్స్​ప్రెస్ రైళ్లను దారిమల్లించారు. పట్టాలు తప్పిన గూడ్స్​రైలును సరి చేయడానికి ఇంకా రెండు గంటల సమయం పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

పలు రైళ్ల వేళల్లో మార్పులు : నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్​ట్రైన్​ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-హౌరా ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ రైలును దారి మళ్లించారు. ఈ రైలు పగిడిపల్లి-కాజిపేట-వరంగల్-కొండపల్లి-మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ - భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్లో మార్పు చేశారు. ఈ రైలు పగిడిపల్లి-కాజీపేట-వరంగల్-కొండపల్లి మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ - లింగంపల్లి షెడ్యూల్లో మార్పు చేశారు. ఈ రైలు గంట లేటుగా బయలుదేరుతుందని ప్రకటించారు. పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయని పనులు పూర్తయిన తర్వాత రైళ్లు యథావిధిగా బయలుదేరుతాయని రైల్వే శాఖ వెల్లడించింది.

ఇదీ జరిగింది : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో నాలుగు భోగీలు పట్టాల నుంచి తప్పిపోయాయి. పట్టాలు తప్పిన సమయంలో మిగతా బోగీలు పడిపోకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. తక్కువ వేగంతో వెళ్తుండటంతో ప్రమాదం తప్పింది. బోగీలను ట్రాక్ పైకి తీసుకురావడానికి గుంటూరు నుంచి ప్రత్యేక క్రేన్ వస్తుంది. అంతకు ముందు పల్నాడు జిల్లా, పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయడంతో ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. మద్రాస్ నుంచి బయలుదేరిన గూడ్స్ రైలు విష్ణుపురం వచ్చేసరికి పట్టాలు అదుపుతప్పి మూడు బోగీలు పక్కకు తప్పాయి. గుంటూరు నుంచి లిఫ్టింగ్ ట్రైన్ తీసుకువచ్చి రైల్వే అధికారులు రూట్​ను క్లియర్ చేయనున్నారు. గుంటూరు నుంచి యంత్రాలు రావడం ఆలస్యం కావడంతో రెండున్నర గంటల నుంచి 6 గంటల వరకు మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో శబరి ఎక్స్​ప్రెస్ నిలిచిపోయింది.

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు - ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

కాకినాడ -సికింద్రాబాద్​కు రైలుకు మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.