ETV Bharat / state

ప్రైవేటు కంపెనీలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ - ప్రభుత్వ తీరుపై వాహనదారుల ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 12:45 PM IST

Fitness Certificate Issue Process to Private Companies: రవాణా ఫిట్​నెస్ ఫీజుల పేరుతో వెయ్యి కోట్ల రూపాయల అదనపు భారం వాహనదారులపై వెయ్యడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ వేస్తున్న వివిధ వాహనాల పన్నులతో ఆర్థికంగా చితికిపోతున్నామని, ఇప్పుడు ఫిట్​నెస్ ఫీజుల పేరుతో అధిక భారం మోపుతున్నారని వాహనదారులు చెబుతున్నారు.

Fitness_Certificate_Issue_Process_to_Private_Companies
Fitness_Certificate_Issue_Process_to_Private_Companies

Fitness Certificate Issue Process to Private Companies: ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రైవేటీకరణ పేరుతో ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భారీ కుంభకోణంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. దీనికోసం టెండర్లు పిలవడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా టెండర్లు దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులపైన తాజాగా ఫిట్​నెస్ ఫీజులు వసూలు చేస్తున్నారు.

ఫిట్​నెస్ సర్టిఫికెట్లు జారీ చేయటానికి చెల్లించాల్సిన ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ పెంపుదలతో వాహనదారులపై వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని కోటి 46 లక్షల వాహనదారులందరిపై ప్రతి సంవత్సరం ఈ భారం పడుతుంది.

బాబోయ్ మావల్ల కాదంటున్న లారీ యజమానులు - పన్ను భారంతో వృత్తినే వదిలేస్తున్న దయనీయ పరిస్థితి

ఇప్పటికే మోటార్ వాహనాల పన్ను, గ్రీన్ టాక్స్, టోల్ టాక్స్, భారీ పెనాల్టీలతో రవాణా రంగాన్ని, వాహనదారులపై భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్​నెస్ పేరుతో తొమ్మిది వందల రూపాయలున్న ఫీజులను సుమారు 12 వేలకు పెంచుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఫిట్​నెస్ సర్టిఫికెట్ల ప్రక్రియ మొత్తాన్ని కట్టబెట్టడం సరైందని కాదని అభిప్రాయపడుతున్నారు

ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో పాటు మరిన్ని రెట్లు అధికంగా వసూలు చేసే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వాహనాల రంగంలో అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్నదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం వలన గుడ్డిగా డబ్బు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేసే ప్రమాదం పొంచి ఉంది. దీనితో మరింత రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి. రవాణా శాఖ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని, జవాబుదారీతనం లేకుండా పోతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

Lorry Owners Worry about High Green Tax బాదుడే బాదుడు..! గ్రీన్ ట్యాక్స్​ భారంతో అల్లాడిపోతున్న రవాణా రంగం..

రవాణా శాఖలో అవినీతిని అరికట్టాల్సిన ప్రభుత్వం, అవినీతికి చట్టబద్ధత కల్పిస్తున్నదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం పేరుతో ఓ చేతితో డబ్బులు ఇచ్చి మరో చేతితో పన్నుల పేరుతో వాహనదారులు నుంచి లాగేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పటానికి అంగీకరించలేదని, మన రాష్ట్రంలోనూ ఆ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతున్నారు.

రవాణా శాఖలో ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతూ పిలిచిన టెండర్లు రద్దు చేయాలని, అదనపు ఫిట్​నెస్ ఫీజుల భారాలను ఎత్తివేయాలని వాహనదారులు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

'రవాణా వాహనాలకు గ్రీన్​టాక్స్ ఉపసంహరించుకోవాలి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.