ETV Bharat / state

ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు - టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 11:45 AM IST

Updated : Mar 3, 2024, 2:06 PM IST

False Cases on TDP Leaders in Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడు టీడీపీ తరపున పోలింగ్‌ ఏజెంట్లుగా నిలబడేందుకు అవకాశం ఉన్న వారిని గుర్తించి రౌడీషీట్లు తెరుస్తున్నారు.

False_Cases_on_TDP_Leaders_in_Andhra_Pradesh
False_Cases_on_TDP_Leaders_in_Andhra_Pradesh

ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు - టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు

False Cases on TDP Leaders in Andhra Pradesh: మృతులను ఓటరు జాబితాలో కొనసాగించడం, ఒకే వ్యక్తికి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు, విపక్ష పార్టీల మద్దతుదారులుగా భావిస్తున్న వారిని ఓటరు జాబితా నుంచి తొలగించడం వంటి అక్రమాలకు తెగబడిన అధికార వైసీపీ నేతలు ఇపుడు ఎన్నికల్లో గెలుపు కోసం మరిన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసుల సాయంతో ప్రతిపక్ష టీడీపీ నేతలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

టీడీపీ తరపున పోలింగ్‌ ఏజెంట్లుగా నిలబడేందుకు అవకాశం ఉన్న వారిని గుర్తించి రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఎన్నికల్లో తమ ఆగడాలకు ఎవరూ అడ్డుపడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల పోలింగ్‌ ఏజంట్లు లక్ష్యంగా పోలీసు కేసులు నమోదు చేయిస్తున్నారు.

ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ప్లాన్​- టీడీపీ శ్రేణులపై బైండోవర్‌ కేసులు

అధికార పార్టీ నేతల కుట్రకు పోలీసుల సహకారం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ నేతల అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలను అణచివేసేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా లబ్ధి పొందాలన్న అధికార పార్టీ నేతల కుట్రకు పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన వందల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండటానికి వీలు లేకుండా చేసేందుకు యత్నిస్తున్న అధికార వైసీపీ నేతలు ఇప్పుడు ఇదే విధానాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ప్రభావం చూపగల నేతలపై కన్నేసిన వైసీపీ నేతలు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో ఆందోళనలు చేశారంటూ కేసులు నమోదు చేసి స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్న పోలీసులు, ఆ కేసులు అడ్డుపెట్టుకొని ఇపుడు ఏకంగా రౌడీషీట్లను తెరుస్తున్నారు.

వైఎస్సార్​సీపీ నీచపు రాజకీయాలు - ప్రతిపక్షల నేతలపై కేసులే లక్ష్యంగా పాలన

సమాచారం ఇవ్వకుండా రౌడీషీట్లు: శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలంలో ఏడుగురు మండలస్థాయి టీడీపీ నేతలపై దాదాపు రెండు నెలల క్రితం రౌడీషీట్‌ తెరిచారు. టీడీపీ నేతలపై రౌడీషీట్లు తెరిచేందుకు జనవరి 10న ఏర్పేడు పోలీసులు రేణిగుంట డీఎస్పీని అనుమతి కోరారు. ఏర్పేడు పోలీసుల నుంచి సిఫారసు వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా రేణిగుంట డీఎస్పీ భవ్యకిశోర్‌ జనవరి 12న అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీట్లు నమోదు చేసిన వ్యక్తులకూ సమాచారం ఇవ్వకుండా రెండు నెలల పాటు గోప్యంగా ఉంచారు. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్న పోలీసులు తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను ప్రతిఘటిస్తారని భావించే నేతలపై మూడు కేసులు పెట్టి తర్వాత రౌడీషీట్ తెరుస్తున్నారు. ఇప్పటికే ఏర్పేడు మండలంలో ఏడుగురిపై ఈ తరహా రౌడీషీట్‌ తెరచిన పోలీసులు, నియోజకవర్గ వ్యాప్తంగా మరో 52 మందిపై తెరిచేందుకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

"శ్రీకాళహస్తిలో ఉన్న టీడీపీ శ్రేణులను గత వారం రోజుల నుంచి పోలీసులు పిలిపిస్తున్నారు. వారిపై కేసులు పెట్టు వేధిస్తున్నారు. ఒక్కో మండలం నుంచి కనీసం 20 మందిపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే 800 పైగా కేసులు పెట్టారు". - బొజ్జల సుధీర్‍ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్

టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర - 8మందిపై కేసు నమోదు

Last Updated :Mar 3, 2024, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.