ETV Bharat / state

వైఎస్సార్​సీపీ నీచపు రాజకీయాలు - ప్రతిపక్షల నేతలపై కేసులే లక్ష్యంగా పాలన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 8:27 AM IST

YSRCP Illegal Cases Against Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసుల నమోదే లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మొదటి నుంచి రివర్సులో నడుస్తోంది. ప్రాథమిక ఆధారాలు సేకరించి అరెస్టు చేయడం రివాజు కాగా, చంద్రబాబు విషయంలో మొదట కేసు అరెస్ట్‌ చేసి సాక్ష్యాధారాల వేట మొదటుపెట్టింది. అలా తెలుగుదేశం అధినేతపై ఇప్పటికీ మొత్తం 7 కేసులు నమోదు చేయగా అన్నింటి నుంచీ చంద్రబాబుకు న్యాయస్థానాలు రక్షణ కల్పించాయి.

ysrcp_illegal_cases_against_chandrababu
ysrcp_illegal_cases_against_chandrababu

వైఎస్సార్​సీపీ నీచపు రాజకీయాలు - ప్రతిపక్షల నేతలపై కేసులే లక్ష్యంగా పాలన

YSRCP Illegal Cases Against Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసుల నమోదు విషయంలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రివర్స్‌ పాలనకు తెగబడింది. ఏదైనా నేరం జరిగితే, ప్రాథమిక విచారణ చేయడం, ఆధారాలు సేకరించడం, నిందితుడి పాత్ర ఉందని తేలితే నోటీసు ఇవ్వడం, వివరణ కోరడం, చట్టబద్ధంగా కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవడం, ఆ తర్వాత కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం రివాజు.

చంద్రబాబు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అందుకు భిన్నంగా వ్యవహరించింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల్లో సాక్ష్యం సేకరించాల్సి ఉందని, ఆయన పాత్రను తేల్చాల్సి ఉందని హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ జరపకుండా నోటీసు ఇచ్చి వివరణ కోరకుండా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుండా, నేరుగా ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు వాదించారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవించింది.

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవసరం లేదు - దర్యాప్తు సంస్థలకు హైకోర్టు చురకలు

ప్రతీకార రాజకీయాలు, కక్షసాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి వైఎస్సార్​సీపీ ప్రభుత్వం సీఐడీ అనే ఆయుధాన్ని ప్రయోగించింది. 6 కేసుల్లో ఇరికించింది. ఇవికాక అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదినేడు పోలీసులు చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు. ఈ 7 కేసుల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. స్కిల్ డెవలప్​మెంట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందంటూ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కె.అజయ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

స్కిల్​ కేసులో చంద్రబాబును సీఐడీ 37వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై ఈ నెల 19న విచారణ ఉంది. ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ, ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతంరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదైంది. ఇందులో 25వ నిందితుడిగా చేర్చారు.

చంద్రబాబుపై అప్పుడే చర్యలు వద్దు - ఏం చేయాలో మేము చెప్తాం: ఏపీ హైకోర్టు

హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించగా, చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం, చంద్రబాబుకు మధ్యంతర రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

ఇక ఇన్నర్ రింగ్‌రోడ్డు విషయంలో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి మొదటి నిందితుడిగా చేర్చారు. ఈ నెల 10న హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. మద్యం విధానంపై ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడో నిందితుడిగా చేర్చారు.

'నేరం చేశానని ఒప్పుకున్న అజయ్‌జైన్​పై కేసు ఏదీ? - ప్రజల అవసరాలు తీర్చే వ్యవస్థ కనిపించట్లేదు'

ఈ కేసులోనూ ఈ నెల 10న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఉచిత ఇసుక విధానంపై గనులశాఖ డైరెక్టర్‌, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో చంద్రబాబును రెండో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులోను హైకోర్టు ఈ నెల 10న ఆయనకు ముందస్తు బెయిలిచ్చింది. అమరావతి ఎసైన్డ్‌ భూముల విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి, మొదటి నిందితుడిగా చేర్చారు.

2021 మార్చి 19న విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాబు విషయంలో దర్యాప్తుతోపాటు తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిగి తీర్పు వాయిదా పడ్డాక, సీఐడీ అనుబంధ పిటిషన్‌ వేసింది. విచారణను తిరిగి ప్రారంభించాలని కోరింది. ఈ కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. ఇక అంగళ్లు ఘటనపై కురబలకోట మండల మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చారు. హైకోర్టు 2023 అక్టోబర్‌ 13న బెయిల్‌ మంజూరు చేసింది.

వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు వివరిస్తున్నారనే చంద్రబాబుపై అక్రమ కేసులు: టీడీపీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.