ETV Bharat / state

వరుస కాల్పులతో దద్దరిల్లుతోన్న దండకారణ్యం - ఎదురుకాల్పుల్లో ములుగు జిల్లాకు చెందిన మావోయిస్టు కమాండర్‌ హతం - 3 Maoists Died in Encounter

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 8:53 AM IST

Encounter at ​​Telangana - Chhattisgarh Border : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. పోలీసులు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కమాండర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి ఏకే-47తో పాటు ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Naxalites Killed In Encounter
Naxalites Killed In Encounter

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు - ముగ్గురు మావోయిస్టుల మృతి

Encounter at ​​Telangana - Chhattisgarh Border : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుస కాల్పులతో దద్దరిల్లుతోంది. నాలుగు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు- మావోయిస్టుల (Security Forces- Naxalites) మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ముగ్గురు హతమయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట - ఛత్తీస్‌గఢ్‌లోని ఊసూరు బ్లాక్ ఠానా పరిధిలోని పూజారీ కాంకేర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ దళాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సెంట్రల్ రీజియన్ కమాండర్ అన్నె సంతోశ్​ అలియాస్ సాగర్‌తో పాటు ఏసీఎం మణిరాం మరో దళసభ్యుడు మృతి చెందారు.

ఘటనా స్థలిలో ఏకే-47తో పాటు 12 బోర్ తుపాకులు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్​సభ ఎన్నికల్లో (Lok Sabha) దాడులే లక్ష్యంగా మావోయిస్టులు ప్రత్యేకంగా సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను (Dead Bodies) హెలికాప్టర్​లో బీజాపూర్‌కు తరలించారు.

5 LaKhs Reward On Anne Santhosh : మావోయిస్టు పార్టీలో క్రమక్రమంగా ఎదిగిన సంతోశ్ భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు ధీటైన వ్యూహరచనలు (Strategic Plans) చేయడం, పకడ్బందీ దాడులు చేయడంలో నేర్పరి. అతనిపై ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు రూ.5 లక్షల రివార్డు (Reward) ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన సంతోశ్​, 22 ఏళ్ల క్రితమే అడువుల బాటపట్టాడు. ఛత్తీస్‌గఢ్ అభయారణ్యం జోనల్ కమిటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎన్​కౌంటర్​ను ఖండిస్తూ బీకేఏఎస్​ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదలైంది. ములుగు ఎస్పీ కనుసన్నల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని, అందుకు ఎస్పీ పూర్తి బాధ్యత వహించాలని, నెత్తుటి బాకీ తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

పోలీసుల ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి : కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపుర్ జిల్లా గంగలూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని లేంద్ర గ్రామ అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలు, కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

'డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్​ ఆపరేషన్​ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు.' అని బస్తర్​ రేంజ్ ఐజీ సుందర్​రాజ్​ తెలిపారు.

గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు - నలుగురు మావోయిస్టులు హతం

మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పేల్చేసిన పోలీసులు - ఇదిగో వీడియో చూసేయండి

ఎన్నికలు అపడానికి మావోయిస్టుల విఫలయత్నాలు - రెండు గ్రామాల మధ్య మందు పాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.