ETV Bharat / state

జనసేన ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసు ఖరారు - పార్టీలో చేరిన పృథ్వీరాజ్, జానీ మాస్టర్​లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 9:27 PM IST

Updated : Jan 24, 2024, 10:25 PM IST

glass_symbol_to_jana_sena
glass_symbol_to_jana_sena

Election Commission Allotted Glass Symbol to Jana Sena: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది. అదే విధంగా హాస్యనటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​లు పవన్ కల్యాణ్​ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

Election Commission Allotted Glass Symbol to Jana Sena: జనసేన పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. ఈ సారి జరగబోయే ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్​కు అందచేశారు.

'ఫిబ్రవరి నుంచి పవన్ కల్యాణ్ ప్రజల్లోనే' - రోజుకు మూడు సభల్లో పాల్గొంటారు : నాదెండ్ల

Actor Prithviraj and Choreographer Johnny Master Joined Janasena Party: ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​లు పవన్ కల్యాణ్​ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారిద్దరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పృథ్వీ, జానీలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహం పాలుపంచుకోవాలని ఆదేశించారు. ఇటీవల పవన్ కల్యాణ్​ నటించిన బ్రో చిత్రంలో పృథ్వీరాజ్ మంత్రి అంబటి రాంబాబు తరహాలో నృత్యం చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ జనసేన పార్టీలో చేరడం పట్ల తన అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కలిసి భోజనం చేసిన చంద్రబాబు, పవన్‌- సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై కీలక మంతనాలు

Former Minister Konatala Ramakrishna Meeting with Pawan Kalyan: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమయ్యే పరిస్థితి ఉందని దానిని కాపాడుకోవాలనే జనసేనలో చేరానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చెప్పారు. జనసేనలో ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని తెలిపారు. బుధవారం కొణతాల మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్​తో సమావేశమయ్యారు. పార్టీ మానిఫెస్టో, పోలవరం, స్టీల్ ప్లాంట్, సుజల స్రవంతి ప్రాజెక్టులపై చర్చించామని రామకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్రను పవన్ కల్యాణ్ దత్తత తీసుకుంటే మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. జాతీయ సంపదైన స్టీల్ ప్లాంట్​ను కాపాడుకోవాలని పవన్​కు చెప్పాన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతోందని తెలిపారు. త్వరలోనే అనకాపల్లిలో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు.

యువత అండతోనే వైఎస్సార్​సీపీతో పోరాటం - 'గ్లాసు టీ' సమావేశంలో పవన్​ కల్యాణ్​

జనసేన ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసు ఖరారు - పార్టీలో చేరిన పృథ్వీరాజ్, జానీ మాస్టర్​లు
Last Updated :Jan 24, 2024, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.