ETV Bharat / state

ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి : భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 9:00 PM IST

Deputy CM Bhatti Vikramarka Launch Solar Power Panel : ప్రజల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కరెంట్‌ ఉత్పత్తిపై, ప్రత్యేక దృష్టిసారించినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తిప్లాంట్‌ ప్రారంభించిన ఆయన, ప్యానల్‌ ఉత్పత్తిపై అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్ల పైబడి అప్పులభారం మోపినా అన్నింటిని అధిగమించి ముందుడుగు వేస్తున్నామని చెప్పారు.

Bhatti Vikramarka on Alternate Power Generation
Deputy CM Bhatti Vikramarka Launch Solar Power Panel

Deputy CM Bhatti Vikramarka Launch Solar Power Panel : రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలో జున్నా సోలార్ పవర్(Solar Power) ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు.

'వేసవిపై దృష్టిసారించండి, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను పెంచాలి'

స్ట్రింగర్ మిషన్ యూనిట్​, వాటి ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్ ప్యానల్ ఉత్పత్తికి సంబంధించి గ్లాస్ లోడింగ్, భస్సింగ్, లే అప్, లామినేటింగ్ ఫ్రేమింగ్(Laminating Framing), క్యూరింగ్ లైన్, క్లీనింగ్ సెక్షన్, సన్ సిమ్ లెటర్, ఐ పోర్టు, ఫైనల్ ఈఎల్ ప్రాసెస్ యూనిట్స్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. 2030 సంవత్సరం నాటికి ప్రజలకు ఉన్న డిమాండ్​కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిని చేస్తామన్నారు.

Bhatti Vikramarka on Alternate Power Generation : ప్రపంచంలో మానవ జాతికి, విద్యుత్ శక్తికి మధ్యన విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. విద్యుత్ శక్తి అవసరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో, ఆ డిమాండ్​కు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రణాళిక బద్ధంగా సౌర శక్తి, పవన శక్తి, చెత్త నుంచి తయారు చేసే విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకుంటూ వస్తోందని వివరించారు.

రాష్ట్రంలో విద్యుత్ నష్టాన్ని పూరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై మా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. సోలార్, విండ్, హైడెల్ పవర్​పై ప్రణాళికలు చేస్తోంది. అదేవిధంగా మున్సిపల్ వ్యర్ధ పదార్ధాల నుంచి తయారు చేసే విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటాం. ప్రజా అవసరాలకు అనుగుణంగా కరెంట్ అందించటమే మా ధ్యేయం. -భట్టి విక్రమార్క, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి

ఈ విధంగా భవిష్యత్​లో ప్రజల అవసరాలు తీర్చుతామని చెప్పారు. విద్యుత్తు రంగంపై గత బీఆర్ఎస్(BRS Party) ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయల పైబడి అప్పుల భారం మోపిందన్నారు. ఈ అప్పుల భారాన్ని అధిగమించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్న థర్మల్ విద్యుత్తు​కు ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక పవర్ ఉత్పత్తిని పెంచుతామన్నారు.

Telangana Govt Focus on Power Sectors : ప్రత్యామ్నాయ విద్యుత్​ను దేశం ప్రజలకు అందించేందుకు దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ(Indira Gandi), రాజీవ్ గాంధీ వేసిన పునాదులు దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలు తీర్చుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రజల అవసరాలను తీర్చే విధంగా స్థాపించిన ఈ కంపెనీ వృద్ధి చెందాలని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి - చేవెళ్లలో సోలార్ ప్లాంట్​ను ప్రారంభించిన భట్టి

మాది ప్రజాస్వామ్య పాలన - తిరుగుబాటు ఉండదు : డిప్యూటీ సీఎం భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.