ETV Bharat / state

'ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం - గత పాలకుల మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 2:23 PM IST

Updated : Feb 21, 2024, 3:15 PM IST

CM Revanth Reddy on Telangana Development : ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy
CM Revanth Reddy

తెలంగాణ ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది

CM Revanth Reddy on Telangana Development : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు(Investors) పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని హోటల్ వెస్టిన్‌లో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, నగర అభివృద్ది కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని వివరించారు.

రాష్ట్రంలో రూ.6వేల కోట్ల రెన్యూసిస్ ఇండియా పెట్టుబడులు

ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారిందని గుర్తు చేశారు. గతంలో అవుటర్‌ రింగ్ రోడ్డు(Outer Ring Road) అవసరం లేదని కొందరన్నారని, ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్‌లైన్‌గా మారిందని సీఎం వివరించారు. తెలంగాణలో విద్య ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు.

ఈ సందర్భంగా విద్య, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపక అవకాశాలు అనే అంశంపై రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగించారు. ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. తమ సర్కార్ పెట్టుబడులు, అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఐటీఐల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వంలో వేధింపులు ఉంటాయని వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, ప్రత్యేక పాఠశాలలు : సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy in CII Meeting : రాష్ట్రంలో 64 ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా 2000 కోట్లతో అభివృద్ది చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల(Skilling University) ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

"ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం. గతంలో ఔటర్‌ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్ లైన్‌గా మారింది. ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కోసం టాటా సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

హైదరాబాద్​లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక : సీఎం రేవంత్

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

Last Updated :Feb 21, 2024, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.