ETV Bharat / state

ఎడెక్స్‌తో వింత ఒప్పందం - కోర్సు అంతర్జాతీయం - సర్టిఫికెట్లు రాష్ట్ర వర్సిటీలవి!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 9:33 AM IST

CM Jagan Will Start EDEX Online Courses: లోపభూయిష్ఠ విధానాలతో ఇప్పటికే పలుమార్లు కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న జగన్‌ ప్రభుత్వం పాలనా కాలం ముగిసే దశలోనూ తీరు మార్చుకోవడం లేదు. ఈ కోవలోనే ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులపై వింత నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కోర్సులకు రాష్ట్ర వర్సిటీలు సర్టిఫికెట్లు జారీ చేసేలా ఆదేశాలిచ్చింది. ఎన్నికల ముందు టెండర్లు లేకుండా ఏకమొత్తంలో 50 కోట్ల చెల్లింపులు చేసేలా ఒప్పందం చేసుకుంది.

CM_Jagan_Will_Start_EDEX_Online_Courses
CM_Jagan_Will_Start_EDEX_Online_Courses

ఎడెక్స్‌తో వింత ఒప్పందం - కోర్సు అంతర్జాతీయం - సర్టిఫికెట్లు రాష్ట్ర వర్సిటీలవి!

CM Jagan Will Start EDEX Online Courses : సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఉంది ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు. కోర్సులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలవట, సర్టిఫికెట్లు మాత్రం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఇస్తాయట. దేశంలో ఎక్కడా లేని వింత విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్యార్థి కావాలనుకుంటే ఆ సంస్థ సర్టిఫికేషన్‌ కోసం పరీక్ష రాసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ చెబుతోంది.

గతేడాది ఒప్పందం : ఎడెక్స్‌ కోర్సులను పాఠ్యప్రణాళికలో భాగం చేసి, ఆయా వర్సిటీలకు కోర్సుల ఎంపిక బాధ్యతలు అప్పగిస్తున్నారు. వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సులనే విద్యార్థులు నేర్చుకోవాలి. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రతి విద్యార్థికీ 1,800 కోర్సులు అందుబాటులో ఉండవు. అయితే ప్రభుత్వం గొప్పగా చెప్పే అంతర్జాతీయ కోర్సు చదివిన విద్యార్థికి స్థానిక విశ్వవిద్యాలయాలే సర్టిఫికెట్‌ ఇస్తే విదేశాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రభుత్వమే చెప్పాలి. ఎడెక్స్‌ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను అందించేందుకు గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే అకడమిక్స్‌లో భాగంగానే ఈ కోర్సులు చదువుతున్నందున ఆయా విశ్వవిద్యాలయాలే సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

Re Counseling of Fake PG Medical Seats in Andhra Pradesh: ఆరోగ్య వర్సిటీలో మొదటి విడత కౌన్సెలింగ్‌ పునఃప్రారంభం.. గందరగోళంలో పీజీ వైద్య విద్యార్థులు

విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు శిక్షణ : ఈ అంతర్జాతీయ కోర్సులను నేడు సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 12లక్షల మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే 2వేల ఎడెక్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులతో పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ, అభ్యసన సామర్థ్యాలు అందించడంలో ఎడెక్స్‌ సహకారం అందిస్తుందని ఎడెక్స్‌ కోర్సుల క్రెడిట్స్‌ కరిక్యులమ్‌లో భాగంగా ఉంటాయని పేర్కొంది.

అయితే కేంద్ర ప్రభుత్వం స్వయం పోర్టల్‌ ద్వారా ఉచిత, స్వల్ప ఫీజులతో అనేక సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తోంది. చాలా అంతర్జాతీయ సంస్థలూ కూడా కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తున్నాయి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వెచ్చించి మరీ ఈ కోర్సులు అందించడం దేనికోసమో జగన్ సర్కారే చెప్పాలి.

Irregularities for PG Medical Seats: ఏపీలో పీజీ వైద్య సీట్ల స్కామ్ గుర్తించిన ఎన్ఎంసీ.. నకిలీ ఆదేశాలను పంపించింది ఎవరు..?

విద్యాశాఖకు మార్గదర్శకత్వం : టెండర్లు పిలవకుండా అధికారుల కమిటీ ద్వారా ఎడెక్స్‌ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీమెన్స్‌ సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తే విమర్శించిన వైసీపీ ప్రభుత్వం ఎడెక్స్‌ మాత్రం గొప్ప సంస్థ అంటూ కితాబిస్తోంది. ఎడెక్స్‌కు 50 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. లైసెన్సులు ఇవ్వగానే ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎడెక్స్‌ సంస్థ ఏడాదికి 4లక్షల లైసెన్సులు ఇస్తుంది. వీటితో 12 లక్షల మంది విద్యార్థులకు కోర్సులు అందిస్తామని ఉన్నత విద్యాశాఖ పేర్కొంటోంది. ఉన్నత విద్యాశాఖకు మార్గదర్శకత్వం కోసమని ఎడెక్స్‌కు చెందిన ఇదాన్‌ ప్రైజ్‌ను నియమించారు.

Education System in Andhra Pradesh : ఇంత చేసి విద్యార్థులకు పాఠాలు ఏమైనా నేరుగా చెబుతారా అంటే అదీ లేదు. కోర్సులకు సంబంధించిన పాఠాలను రికార్డు చేసి వీడియోల రూపంలో ఎడెక్స్‌ సంస్థ అందిస్తుంది. విద్యార్థులు వీటిని విని, నేర్చుకోవాల్సిందే. విద్యార్థికి సందేహాలు వస్తే నివృత్తి చేసే వ్యవస్థ ఏదీ లేదు. సందేహాలను ఆన్‌లైన్‌లో పెడితే ఆ తర్వాత దానికి తీరిగ్గా సమాధానమిస్తారంటా. సర్టిఫికేషన్‌ పరీక్షలకు ఎడెక్స్‌ సంస్థ ప్రశ్నల జాబితాను అందిస్తుంది. వాటిలోంచి కొన్నింటిని ఎంపిక చేసుకుని, వర్సిటీలు పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థి ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా నేర్చుకోవాల్సిన గంటలు, క్రెడిట్లు ఉంటాయి. వీటిని రాష్ట్ర వర్సిటీలు వాల్యూ యాడెడ్‌ కోర్సులుగా పరిగణించి, సర్టిఫికెట్లు ఇస్తాయి. డిగ్రీ, పీజీ స్థాయిలో రెండు, నాలుగో సెమిస్టర్‌, ఇంజినీరింగ్‌లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌లో ప్రతి విద్యార్థి వర్సిటీ, కళాశాల ఎంపికచేసిన ఎడెక్స్‌ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది.

Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.