ETV Bharat / state

అగ్గిపెట్టె కోసం ఘర్షణ - బీరు సీసాతో కొట్టడంతో యువకుడు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 11:01 PM IST

Updated : Jan 19, 2024, 11:21 PM IST

Clash Between Two Persons for Match Box : అగ్గిపెట్టె కోసం ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. పక్కన ఉన్న మిగతా యువకులు కూడా ఈ గొడవలో తలదూర్చడంతో రక్తపాతంతో ముగిసింది. దీంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్​ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది.

Clash Between Two Persons for Match Box
అగ్గిపెట్టె కోసం యువకుల మధ్య ఘర్షణ - బీరు సీసాతో కొట్టడంతో యువకుడు మృతి

Clash between Two Persons for Match Box : అగ్గిపెట్టె కోసం తలెత్తిన గొడవ ఓ యువకుని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో రామ్​చరణ్​ అనే యువకుడు వరంగల్​ జిల్లా(Warangal) రాయపర్తి మండలం కులంపల్లిలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. గత సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి సరదాగా గ్రామంలోని పాఠశాలకు వెళ్లాడు.

ఈ క్రమంలో అంతకముందే అక్కడ మద్యం సేవించిన కొంత మంది యువకుల దగ్గరకు రామ్​చరణ్ వెళ్లి​, అగ్గిపెట్టె అడిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా మిగతా యువకులు కూడా తలదూర్చారు. అక్కడున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ గొడవలో రామ్​చరణ్​పై బీరు సీసాతో దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుణ్ని వరంగల్ ఎంజీఎం(MGM) ఆసుపత్రికి తరలించారు.

A Man Died after clash among Youth : అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రామ్ చరణ్ మృతి చెందాడు. దీంతో యువకుని స్వగ్రామమైన పర్వతగిరి మండలం అనంతపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Young People Fight at Sanathnagar Viral Video : ఇదికాగా మరోవైపు పండగ వేళ కూడా మద్యం మత్తులో యువత చెలరేగిపోయారు. గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలు, రాళ్లు ఆయుధాలుగా మారాయి. స్థానికులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా మరింతగా రెచ్చిపోయి కొట్టుకున్నారు. దీంతో నగరవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు వచ్చి కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లోని సనత్​నగర్​లో జరిగిన ఘటనలో పలువురు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Young People Godava at Sanatnagar Viral : పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​లోని సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బోరబండ బస్టాండ్​ దగ్గరలో హరినగర్​, రామానగర్​లో అర్ధరాత్రి యువకుల మధ్య గొడవ జరిగింది. వారందరూ మద్యం మత్తు(Youth Fight Video)లో ఉన్నారని గమనించిన స్థానికులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వారి వినిపించుకోకుండా కర్రలు, రాళ్లతో చెలరేగిపోయారు. దీంతో కొంతమంది యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బస్తీవాసులు చూసి 100 నంబర్​కు ఫోన్​ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువత గొడవ పడుతున్న వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

పచ్చిమాంసం తినొద్దన్నందుకు గొడవ- యువకుడి దారుణ హత్య

మద్యం మత్తులో గొడవ పడిన యువకులు- భయందోళనలో బస్తీవాసులు

Last Updated : Jan 19, 2024, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.