ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్​ కేసు - పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్​

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 11:57 AM IST

Updated : Feb 5, 2024, 8:25 PM IST

CI Arrest in MLA Shakeel Son Case : మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్​ కేసులో మరో సీఐని పోలీసులు అరెస్ట్​ చేశారు. మాజీ సీఐ దుర్గారావును ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. ఆయణ్ను డీజీపీ కార్యాలయంలో విచారణ చేసిన అనంతరం అరెస్టు​ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Hit and Run Case Update
CI Arrest in MLA Shakeel Son Case

CI Arrest in MLA Shakeel Son Case : మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్(Rash Driving) చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కేసులో మాజీ ఇన్​స్పెక్టర్​ దుర్గారావును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ11గా ఉన్న దుర్గారావు పరారీలో ఉండగా తెల్లవారు జామున ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్​లో రైలులో వెళ్తున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చారు.

ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్​చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు

Hit and Run Case Update News in Hyderabad : 2023 డిసెంబర్ 23 రాత్రి మూడు గంటల సమయంలో అతివేగంగా దూసుకెళ్లిన కారు ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్, బారీకేడ్లను ఢీకొట్టింది. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట ఇన్​స్పెక్టర్​ దుర్గారావు ఘటనాస్థలానికి వెళ్లారు. ఆ కారు బోధన్‌ మాజీ ఎమ్యెల్యే షకీల్‌(Bodhan EX MLA Shakil) తనయుడు సాహిల్‌ నడిపినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణించారని ధ్రువీకరించారు. నిందితుడు సాహిల్‌ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో నిందితుడిని పరీక్షించేందుకు పక్కనే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

EX MLA Shakeel Son Sahil Case Update : పోలీస్​ స్టేషన్​ నుంచి రక్షకభటుల కన్నుగప్పి సాహిల్‌ తప్పించుకున్నాడు. నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు పూర్తిగా సహకరించారని బయటపడింది. ప్రజాభవన్, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌(Panjagutta Police Station) వద్ద సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు దీన్ని నమోదుచేసుకున్నారు. అంతర్గత విచారణలోనూ దుర్గారావు కేసును పక్కదారి పట్టించాడని, నిందితులను మార్చేందుకు పలువురితో ఫోన్‌లో మంతనాలు జరిపినట్టు నిర్దారించారు. దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి దుర్గారావు పరారీలో ఉన్నారు. అతని కోసం ఐదు బృందాలుగా పోలీసులు గాలించారు.

ప్రజాభవన్ ముందు జరిగిన కారు ప్రమాదంలో నిందుతుణ్ని తప్పిస్తున్నారా - పోలీసుల పాత్రపై అధికారులు అనుమానం

EX MLA Shakeel Son Case Details : దుర్గారావు కోసం గాలిస్తున్న పోలీసుల అతని ఆచూకి కనుగొన్నారు. చెన్నై నుంచి ముంబై వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ మార్గంలో ఎల్​టీటీ ఎక్స్‌ప్రెస్ ఏ1 భోగిలో పంజాగుట్టలోని ఓ కేసు ముద్దాయి వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గుంతకల్ రైల్వే స్టేషన్​కు వస్తుందని తెలుసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ స్టేషన్​లో ఉన్న రైల్వే పోలీసులకు పంజాగుట్ట పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే స్టేషన్​లో ఆగగానే జీఆర్‌పీఎఫ్​ ఎస్సై అతను ఉన్న కోచ్​లోకి వెళ్లి నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు.

Sahil Case in Hyderabad : దుర్గారువును అదుపులోకి తీసుకున్న విషయాన్ని పంజాగుట్ట పొలీసులకు రైల్వే పోలీసులు తెలిపారు. అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు అతడిని నగరానికి తీసుకొచ్చారు. పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో విచారించారు. కాగా ఇప్పటికే అతడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. దుర్గారావు అరెస్ట్(CI Durga Rao Arrest)​తో ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం - భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు

8 Members Arrest in EX MLA Shakeel Son Sahil Case : మరోవైపు దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సాహిల్, మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కోసం ఇప్పటికే పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీచేశారు. గతంలో నిందితుడు సాహిల్ దుబాయ్‌ పారిపోయేందుకు సహకరించిన అరసబ్, సోహెల్, అసిద్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల నిజామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్, అబ్దుల్‌వాహెలను అరెస్ట్ చేశారు. తాజాగా దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడి హిట్​ అండ్​ రన్​ కేసులో మరో ట్విస్ట్ ​- అదుపులోకి బోధన్ సీఐతో పాటు మరో వ్యక్తి

Last Updated :Feb 5, 2024, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.