ETV Bharat / state

రూ.10 కోట్ల సాయం అందినా దక్కని చిన్నారి ప్రాణం - మరో రూ.6 కోట్లు తక్కువ పడటంతోనే! - Six Months Baby Died Fatal Disease

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 12:02 PM IST

Child Died of a Fatal Disease in Yadadri : ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఓ బాలుడి చికిత్స కోసం కావాల్సిన రూ.16 కోట్లలో ఓ ప్రైవేట్​ సంస్థ రూ.10 కోట్లు సమకూర్చినా ఆ పసికందు ప్రాణాలు దక్కలేదు. ఆ చిన్నారి తల్లిదండ్రులు మధ్య తరగతి కుటుంబం కావడంతో మిగిలిన నగదు ఏర్పాటు చేయలేకపోవడంతో తమ బాబును కాపాడుకోలేకపోయారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

KID DIED DUE TO INSUFFICIENT MONEY
6 Months Kid Died in Yadadri (ETV Bharat)

Child Died of a Fatal Disease in Yadadri : అబ్బాయి పుట్టాడని సంతోషించిన ఆ తల్లిదండ్రులు, మూడో నెల వచ్చే సరికి కదలికలు సరిగా లేవని గుర్తించి ఆందోళన చెందారు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాంతక వ్యాధి వచ్చిందని తెలుసుకున్నారు. ఆ వ్యాధి నివారణకు ఇంజెక్షన్​ ఒక్కటే మార్గమని, దానికోసం రూ.16 కోట్లు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు అక్కడే విషాదంలో మునిగిపోయారు. వారు మధ్య తరగతి కుటుంబం కావడంతో దాతలను ఆశ్రయించారు. దానికి స్పందించిన ఓ సంస్థ రూ.10 కోట్లు ఇచ్చింది. అయినా మిగిలిన డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉండటంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విషాదక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

6 Months Baby Died
మృతి చెందిన బాలుడు భవిక్‌రెడ్డి (ETV Bharat)

6 Months Baby Died due to Insufficient Money : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల మదిర గ్రామం గోలిగూడేనికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి - యామిని దంపతులకు 6 నెలల కుమారుడు భవిక్‌ రెడ్డి ఉన్నాడు. దిలీప్‌ రెడ్డి హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. కుటుంబంతో పాటు అక్కడే నివాసం ఉంటున్నారు. బాబు పుట్టినప్పుడు బాగానే ఉన్నప్పటికీ, మూడో నెల నుంచి బాబు కదలికలు సరిగా లేవని దంపతులు గుర్తించారు. దీంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి చిన్నారి స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ(నరాల కండరాల బలహీనత) టైప్‌-1 హైరిస్క్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.

అయ్యో పాపం - 5 నెలల పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క - PET DOG KILLED A BOY IN VIKARABAD

Child Died Due to Fatal Disease : ప్రాణాంతకమైన వ్యాధి నయం కావడానికి ఇంజెక్షన్‌ ఒక్కటే మార్గమని, అది అమెరికాలో లభిస్తుందని, దాని ఖరీదు రూ.16 కోట్ల ఉంటుందని తెలిపారు. తమది మధ్య తరగతి కుటుంబం కావడం, కుమారుడి వైద్యం కోసం సమకూర్చాల్సిన డబ్బు రూ.కోట్లలో ఉండటంతో దిలీప్‌ రెడ్డి దాతల సహకారం కోరారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఓ ఫార్మా కంపెనీ రూ.10 కోట్లు సమకూర్చింది. మిగిలిన రూ.6 కోట్లు సమకూరలేదు. దీంతో ఇంజెక్షన్‌ను తెప్పించలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవిక్‌ రెడ్డి పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో అతని తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది.

హనుమకొండ జిల్లాలో అమానుషం - అప్పుడే పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన వైనం - a baby girl found in Hanamkonda

ప్రాణం కోసం యుద్ధం- మృతిచెందిన తల్లికి ఆపరేషన్​ చేసి పసికందుకు జననం- అనాథగా నెలలు నిండని శిశువు - Palestinian Baby Is Born As Orphan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.