ETV Bharat / state

ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు- 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ - Heavy Rush At Bus Stations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 7:56 PM IST

Heavy Rush At Bus stations : 13న జరిగే ఓట్ల పండగ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు జనం అంతా ఒకేసారి వెళ్తుండడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. భాగ్యనగరంలో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు పదిలక్షల మంది ఓటర్లున్నారు. చాలా మంది రవాణా సదుపాయాలు సరిపోక తీవ్ర అవస్థలు పడుతూనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేందుకు రాకపోకలు సాగిస్తున్నారు.

heavy_rush_at_bus_stations
heavy_rush_at_bus_stations (Etv Bharat)

ప్రయాణీకులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు- 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ (Etv Bharat)

Heavy Rush At Bus stations : ఓటు వేసేందుకు హైదరాబాద్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వాసులు సొంతూరు బాటపడుతున్నారు. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు. సోమవారం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈసీ ఆదేశాలతో చాలా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఫలితంగా 13న జరిగే పోలింగ్‌ కోసం భారీగా సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వే అదనపు సేవలు సమకూర్చినా రద్దీకి తగినట్లుగా సరిపోవడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్​ ట్రావెల్స్​ సంస్థల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. మామూలు రోజుల కన్నా రెట్టింపు పిండేస్తున్నారని జనం వాపోతున్నారు.

రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: చంద్రబాబు - Chandrababu Message to People

బస్టాండ్ల వద్ద విపరీతమైన రద్దీ : హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, మియాపూర్‌ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లు సైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పంచామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati

"ఓటేసేందుకు కర్నూలుకు వెళ్తున్నాను. మాములుగా టికెట్ ధరలు రూ.300-400 ఉండేది. ఇప్పుడు ఒకేసారి ప్రైవేటు ట్రావెల్స్​ వారు రూ.800 లు డిమాండ్ చేస్తున్నారు. అధిక ధరలు అడుగుతున్నారు. మేము కేవలం ఓటు వేసేందుకే ఇంటికి వెళ్తున్నాం. సరిపడినన్ని బస్సులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు చొరవ చూపించి మరిన్ని బస్సులు పెంచాలి" - ప్రయాణీకులు

Heavy Rush At Toll Plaza : సొంతూళ్లకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి కార్లు, బస్సులు, ఇతర వెహికల్స్‌తో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు 8 ఎగ్జిట్‌లు ఉండగా ఓట్ల రద్దీ దృష్ట్యా దాన్ని పదికి పెంచారు. మామూలు రోజుల్లో 35 వేల వాహనాలు వెళుతుండగా ఎన్నికల వేళ అదనంగా మరో 5 వేలు పెరిగినట్లు జీఎంఆర్​ అధికారులు తెలిపారు. ఆదివారం వాహనాల రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనావేస్తున్నారు.

బోసిపోయిన భాగ్యనగరం: పోలింగ్‌లో పాల్గొనేందుకు భాగ్యనగరం నుంచి ఓటర్లు భారీగా వెళ్తుండడంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. వరుసగా మూడ్రోజులు సెలవు రావడం వల్ల కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలివెళ్లారు.

పిఠాపురంలో ఉత్సాహంగా సాగిన పవన్‌ రోడ్‌ షో - దారి పొడవునా జనం నీరాజనాలు - Pawan Kalyan Road Show

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.