ETV Bharat / snippets

నరసరావుపేటలో టెన్షన్​ - పిన్నెల్లి కోసం కోర్టు ఆవరణలో పోలీసుల పహారా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 3:22 PM IST

Updated : May 23, 2024, 3:47 PM IST

mla_pinnelli_ramakrishna
mla_pinnelli_ramakrishna (ETV Bharat)

Police Vigil in Narasaraopet Court Premises for MLA Pinnelli: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఘటన జరిగిన దగ్గర నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పోలీసులకు కనిపించకుండా పారిపోయారు. ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే పిన్నెల్లి కచ్చితంగా లొంగిపోతారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు.

Last Updated : May 23, 2024, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.