ETV Bharat / state

'దానం నాగేందర్​పై అనర్హత వేటు వేయాలి' - స్పీకర్​కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 1:54 PM IST

Updated : Mar 18, 2024, 3:20 PM IST

BRS Leaders Complaint Against Danam Nagendar : బీఆర్​ఎస్​ తరఫున గెలిచి కాంగ్రెస్​ కండువా కప్పుకున్న ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సభాపతికి ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు.

Danam Nagendar Joins Congress
BRS Leaders Complaint Against Danam Nagendar

BRS Leaders Complaint Against Danam Nagendar : బీఆర్​ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్​ కండువా కప్పుకున్న ఖైరాతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​పై (Danam Nagendar Joins in Congress) వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు సభాపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరగా స్పీకర్​ సానుకూలంగా స్పందించారని హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలన్నారని గుర్తు చేశారు.

"పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో దానం నాగేందర్​పై అనర్హత వేటు పడుతుంది. రేవంత్ రెడ్డి మాపై దెబ్బ కొట్టారు. మేం తీసుకున్నాం. మేం కొట్టే దెబ్బ తీసుకోవడానికి రెడీగా ఉండండి. మా దెబ్బ పడ్డాక లేవడం మీ వల్ల కాదు. మేం గేట్లు తెరిస్తే మీరు భూస్థాపితం అవుతారు. జాగ్రత్త!! " - పాడి కౌశిక్​ రెడ్డి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

Danam Nagendar Joins Congress
BRS Leaders Complaint Against Danam Nagendar

BRS Leader Reaction on Danam Nagender Party Change : బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై కరీంనగర్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి వినోద్​ కుమార్​ స్పందించారు. దానం హస్తం తీర్థం పుచ్చుకోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసన సభాపతిని కోరామన్న ఆయన, సభాపతి ఈ అంశాన్ని పెండింగ్​లో పెడుతున్నారన్నారు. తమ పిటిషన్​పై త్వరగా తేల్చాలని ప్రసాద్ కుమార్​ను కోరామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ భవన్​లో ఆయన మాట్లాడారు.

వరుసపెట్టి కారు దిగుతున్నారు - వలసలతో గులాబీ పార్టీలో గుబులు

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్​పై అనర్హత పడ్డట్లేనని వినోద్​ కుమార్​ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇంకా వేచి చూడకుండా, సభాపతి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీలు మారే వారిపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy on Party Migration) , స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చబోమని తాము స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. రేవంత్ తన పార్టీలో ఉన్నవాళ్లు పోకుండా చూసుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులకు ప్రతిపక్ష పాత్ర ఒక వరమన్న ఆయన, ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడరని అనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ వలసలను ప్రోత్సహించడం సబబు కాదన్నారు.

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

Last Updated : Mar 18, 2024, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.