ETV Bharat / state

జగనన్నపై బెట్టింగ్​కు జంకుతున్న పందెంరాయుళ్లు - Bookies bet big on TDP win in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 9:34 PM IST

Etv Bha Bookies betting heavily on TDP
Etv Bha Bookies betting heavily on TDP

Bookies betting heavily on TDP: కాయ్ రాజా కాయ్ అంటూ రాష్ట్రంలో బెట్టింగ్​లు జోరందుకున్నాయి. ఈసారి ప్రత్యర్థికి 120 ఖాయం అంటూ ఒకరంటుంటే , ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కు 60లోపే అంటూ మరొకరంటున్నారు. ఈ బెట్టింగ్ లు ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ మ్యాచ్​ల గురించి మాత్రం కాదు. రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతిపక్ష- అధికార పార్టీలు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటాయనే అంశంపై.

Bookies betting heavily on TDP: కాదేదీ బెట్టింగ్​కి అనర్హం అన్నట్లు ఉంది రాష్ట్రంలో పందె రాయుళ్ పరిస్థితి. ఈసారి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రానుందీ మొదలుకుని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ ప్రాంతంలో ఎన్ని వస్తాయి ? ఏ అభ్యర్ధికి ఎంత మెజారిటీ వస్తుంది.? అనే అంశాలపై జోరుగా బెట్టింగ్​లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బెట్టింగ్​లకు ప్రసిద్ధి భీమవరం ప్రాంతం. కోడి పందాలు మొదలు, ఐపీఎల్, ఇతరత్రా క్రీడలు, ఎన్నికలు ఇలా ఏదైనా, పక్కా సర్వేలు, ఖచ్చితమైన అంచనాలతోనే ఈ ప్రాంత బెట్టింగ్ బుకీలు బరిలోకి దిగుతారు. వివిధ ఏజెన్సీలు ప్రకటించే సర్వేల మీదే ఆధారపడకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సర్వేలు జరుపుతూ, కొత్త కొత్త ఆప్షన్లు పందెం రాయళ్ల ముందు పెట్టడం వీరి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో బుకీలంతా తెలుగుదేశం వైపు మెుగ్గుచూపుతున్నారు.

తాజాగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల జోరు కూడా ఊపందుకోవటంతో, అదే స్థాయిలో బెట్టింగ్​ల జోరు స్పీడ్ అందుకుంది. పోలింగ్​కు సమయం సమీపించే కొద్దీ ఊరించే ఆప్షన్లు బుకీలు పందెం రాయళ్ల ముందు ఉంచుతున్నారు. ఇటీవల వచ్చిన జాతీయ మీడియా సర్వేల్లో ఎక్కువ శాతం కూటమి పక్షాన నిలవటంతో , పందెం రాయళ్లంతా ఆ పక్కనే పందెం కాస్తున్నారు. కూటమికి 120 స్థానాలపైనే వస్తాయంటూ సర్వేలు స్పష్టం చేయటంతో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆప్షన్ లో సమంగా జరిగే బెట్టింగ్​ను నిలుపుదల చేసేశారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసేవారు ఇప్పుడు పందెం కాయాలంటే అది 1:10 రేషియోలోనే. అంటే ఒకశాతం ప్రత్యర్థి వర్గం బెట్టింగ్ కాసి అనకున్న పార్టీ గెలిస్తే, వీళ్లు అందుకు పదిరెట్లు అదనంగా చెల్లించాలి. ఇంత రిస్కీ బెట్టింగ్ జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్లట్లేదు. దీంతో ఇప్పుడు పందెం రాయళ్లు ముందు పెట్టి ఊరిస్తున్న ఆప్షన్లన్నీ అధికార పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పరిమితం కానుందన్న దానిపైనే సాగుతున్నాయి. అధికార పార్టీకి ఈసారి దక్కే స్థానాలు 60లోపే నంటూ ఒక పందెం, 50లోపే నంటూ ఊరించే పందెలు గట్టిగా సాగుతున్నాయి. ఈ రెండు ఆప్షన్లలో పందెలు కాసేవారి సంఖ్య తగ్గినప్పుడల్లా వారిని ఆకట్టుకునేందుకు ఓ పది స్థానాలను బుకీలు అధికార పార్టీకి పెంచి తగ్గిస్తున్నారే తప్ప మేజిక్ పిగర్ మాత్రం దాటించట్లేదు.

ఆన్​లైన్​ మోసాలకు తెరలేపిన యువకుడు ​- చివరకు పోలీసుల చేతికి

గోదావరి జిల్లాల్లో కూటమి అత్యధిక స్థానాలను గెలుస్తుందంటూ ఓ తరహా బెట్టింగ్ నడుస్తుంటే, అధికార పార్టీ సింగిల్ డిజిట్​కే పరిమితమవుతుందనే బెట్టింగ్ మరొకటి నడుస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య అయిదు లోపేనంటూ మరో ఊరించే పందెం నడుస్తోంది. చద్రబాబు, పవన్​ల ఉమ్మడి ప్రచారం తరువాత మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ తరహా బెట్టింగ్​లు పెరిగాయని తెలుస్తోంది.

రాయలసీమలో గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం, ఈసారి ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధిస్తుందనే పందెం మరొకటి సాగుతోంది. మొత్తం 52 స్థానాలున్న రాయలసీమ ప్రాంతంలో ఈసారి కూటమి భారీ సంఖ్యలోనే స్థానాలను కొల్లకొడుతుందనే పందెం ఆ ప్రాంత పందెం రాయళ్లను ఆకట్టుకుంటోంది. ఇక ముఖ్యనేతలు పోటీ చేసే స్థానాల్లో మెజారిటీలపై మరో తరహా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కుప్పం, పిఠాపురం, మంగళగిరి స్థానాల్లో కూటమి అభ్యర్థులు సాధించే మెజారిటీపై ఓ తరహా బెట్టింగ్ జరుగుతుంటే, పులివెందులలో ఈసారి జగన్ మెజారిటీ గతం కంటే ఖచ్చితంగా తగ్గుతుందనే అంశంపైనా మరో బెట్టింగ్ సాగుతోంది. కడప ఎంపీ సీటు ఎవరు గెలుస్తారనే అంశంపైనా ప్రత్యేక పందెం నడుస్తోంది. ఇక నామినేషన్ల పరిశీలిన పూర్తై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవ్వరనే స్పష్టత మరో వారం రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మరిన్ని కొత్త ఆప్షన్లు పందెం రాయళ్ల ముందు పెట్టేందుకు బుకీలు సిద్ధమవుతున్నారు.

మహాదేవ్​ బెట్టింగ్ యాప్ యజమాని దుబాయ్​లో అరెస్ట్- త్వరలో భారత్​కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.