ETV Bharat / state

పెండ్లి దావత్​ల తాటిముంజలు, నీరా - అట్లుంటది మరి తెలంగాణోళ్లతోని - ICE APPLES IN WEDDING RECEPTION

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 3:00 PM IST

Sugar Cane Pieces in Hyderabad Wedding
Ice Apples in Reception in Hyderabad

Ice Apple in Hyderabad Wedding Reception : ఈ మధ్యన పెండ్లి అనంగనే అందరూ ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్లను నానాగత్తర పనలు చేస్తండ్రు. కానీ కొందరు మాత్రం మన పాతకాలం ముచ్చట్లను మళ్ల మన కండ్ల ముందుకు తెస్తండ్రు. పాత పెండ్లి పోకడలకు కొత్తదనాన్ని జేర్చి ఓ కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుండ్రు. తెలంగాణల పెండ్లి, పెండ్లి దావత్​కు ఉండే క్రేజే వేరు. అసలు భారతదేశంలనే గిట్ల పెండ్లి ఎవరూ చేయరు. ఇక ఇక్కడ పెండ్లి దావత్​ల పెట్టే తిండి ఐటెమ్స్ ఉంటయ్ కదా. ఆహా.. మీకు చెప్పుతాంటనే నాకు నోరూరతంది. గిట్లనే ఓ అయ్య తన కొడుకు పెండ్లిని ధూంధాం చేసిండు. ఇక మారుపెండ్లికి వచ్చేటోళ్ల కోసం కోడి, మేక, చేప ఇట్ల అన్ని రకాల నీసు ఐటెమ్స్ పెట్టిండు. అసలే ఎండకాలం గదా. ఇట్ల నీసు తిని వేడి జేస్తదని సల్లంగుండేదుకు తాటి ముంజలు, నీరా కూడా మెనూల పెట్టిండు.

పెండ్లి దావత్​ల తాటిముంజలు, నీరా - అట్లుంటది మరి తెలంగాణోళ్లతోని

Ice Apple in Wedding Reception in Hyderabad : తెలంగాణల పెళ్లి అంటే మామూలుగా ఉండది. ఇక్కడ సావునే ధూంధాంగా జరుపుకుంటం. ఇక పెళ్లిని ఏ రేంజ్​ల చేస్తరో మీ ఊహకే వదిలేస్తున్న. తెలంగాణోళ్ల పెళ్లంట అందరూ ముందుగ అడిగేది తిండి గురించే. దావత్​ల ఏం పెడ్తుండ్రు. ముక్క ఉందా లేదా అనే యావనే ఉంటది ఈడ. మామూలుగానే తెలంగాణోళ్లకు ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇగ ఇట్లాంటి దావత్​లల్లా ముక్క పక్కా ఉండాల్సిందే. ముక్క లేదంటే ఇజ్జత్ తీస్తరు. తెలంగాణ పెళ్లి దావత్​ల గురించి బొచ్చెడు కథలున్నయ్.

అందుకే రంగారెడ్డి మాడుగులకు చెందిన ఓ తండ్రి మాత్రం తన కొడుకు రిసెపన్ష్ మెనూ కోసం కొంచెం వెరైటీగా ఆలోచించాడు. సమ్మర్​లో పెళ్లి చేస్తున్నాం కదా ఎలాగో నాన్​వెజ్​ తింటారు. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ యాడ్ చేస్తే బాగుంటదనుకున్నాడు. అప్పుడొచ్చింది ఓ అద్భుతమైన ఐడియా. తెలంగాణలో సమ్మర్ స్పెషల్ ఏంటంటే ముందు గుర్తొచ్చేది కల్లు, ముంజలు, నీరా. ఇగ మామూలుగానే పెళ్లికాడ ఏదో విషయంల లొల్లిల్లు జరుగుతయ్. దానికి తోడు కల్లును కూడా పోస్తే ఇగ ఏం లేదని ఆ ఆలోచనకు అక్కణ్నే ఫుల్​స్టాప్ పెట్టిండ్రు.

ఇంకేం చేయాలే అని బుర్రని మెలిపెట్టి చివరకు తాటి ముంజలు, నీరా, చెరకు రసానికి ఫిక్స్ అయిపోయిండ్రు. ఇక జూస్కోండ్రి పెళ్లికి వచ్చినొళ్లంత భలే ఖుష్ అయిండ్రు. పిల్లకాయలైతే అసలు తాటిముంజల కాన్నుండి కదులుడే లేదు. పెళ్లిల మంచి తిండి పెట్టుడే కాకుండా సల్లగ ఉండేటట్టు నీరా, ముంజలు పెట్టిన కొత్తజంటను సల్లంగ ఉండుండ్రి అని నిండు మనసుతో దీవించి ఎవరి ఇళ్లకు వాళ్లు పోయిండ్రు.

కొత్త అల్లుడికి సర్పైజ్​ - 300 రకాల వంటలతో విందు

చికెన్ 'సేమియా' బిర్యానీ.. రుచిచూస్తే అస్సలు వదలరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.