ETV Bharat / sports

జట్టు నిండా వీరులే కానీ 78 పరుగులకే ఆలౌట్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 12:24 PM IST

జట్టు నిండా వీరులే కానీ 78 పరుగులకే ఆలౌట్‌!
జట్టు నిండా వీరులే కానీ 78 పరుగులకే ఆలౌట్‌!

South Africa T20 League 2024 : సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని అందుకుంది.

South Africa T20 League 2024 : సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో అద్భు ఘన విజయం సాధించింది. దీంతో పాటే బోనస్ పాయింట్ అందుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ - సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి 15.2 ఓవర్లలోనే కేవలం 78 పరుగులే చేసి కుప్పకూలింది. రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది. డేనియల్ వోరాల్ దెబ్బకు కెప్టెన్ డుప్లెసిస్, రీజా హెండ్రిక్స్ డకౌట్ అయ్యారు. డుప్లూయ్ (12 బంతుల్లో 18), మాడ్సెన్ (23 బంతుల్లో 32) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ సన్‌రైజర్స్ బౌలర్ల దెబ్బకు వారు కూడా వరుసగా వికెట్లు కోల్పోయారు. మొత్తంగా జట్టు బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. జో బర్గ్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌, రెజా హెండ్రిక్స్, మొయిన్‌ అలీ వంటి విధ్వంసకర ప్లేయర్స్​ కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌కు చేరడం గమనార్హం. మాడ్సెన్ ఒక్కడే 32 పరుగులు చేశాడు. డేనియల్, పాట్రిక్ చెరో మూడు వికెట్లు తీయగా జేన్సన్, బేయర్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన సన్‌రైజర్స ఈస్టర్న్ కేప్ 11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్‌ మలాన్‌(40 నాటౌట్‌), టామ్‌ అబెల్‌(26) పరుగులతో మ్యాచ్‌ను ముగించారు.

డేనియల్
డేనియల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.