ETV Bharat / sports

రోహిత్ 'రివర్స్ స్వీప్' సీక్రెట్- అప్పుడే ట్రై చేయాలట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 3:30 PM IST

Updated : Jan 20, 2024, 3:42 PM IST

Rohit Sharma Reverse Sweep: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రీసెంట్​గా అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​లో బాదిన స్విచ్ షాట్​కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ షాట్ గురించి రోహిత్ ఏమన్నాడంటే?

Rohit Sharma Reverse Sweep
Rohit Sharma Reverse Sweep

Rohit Sharma Reverse Sweep: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రీసెంట్​గా అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్​లో రోహిత్ 8 సిక్స్​లు సహా, 121* పరుగులు బాదాడు. అయితే అఫ్గాన్ స్పిన్నర్ షరాఫుద్దిన్ అష్రఫ్ బౌలింగ్​లో రివర్స్ స్వీప్​ ఆడాడు. దీంతో బంతి స్టాండ్స్​లో (సిక్స్)కి వెళ్లింది. ఈ షాట్ మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది.

అయితే ఈ షాట్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఎబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ లాగా బాదాడంటూ సోషల్ మీడియాలో రోహిత్​పై ప్రశంసలు కురిశాయి. అయితే తాను రివర్స్​ స్వీప్ ఆడడంపై రోహిత్ స్పందించాడు. అలా స్విచ్ షాట్​​లు ఆడేందుకు ఎంతో కాలం నుంచి నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పాడు. అలాంటి షాట్లు బాదడం వల్ల ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టవచ్చని రోహిత్ పేర్కొన్నాడు.

'నేను ఈ షాట్​ ఆడేందుకు గత రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలంటే ఇలాంటి షాట్స్ ఆడాల్సి ఉంటుంది. బంతి తిరుగుతున్నప్పుడు స్ట్రయిట్​ షాట్స్ ఆడలేం. అలాంటప్పుడు కొత్తగా ప్రయత్నించాలి. టెస్టుల్లోనూ ఒకటి, రెండు సార్లు నేను ఈ షాట్ కొట్టేందుకు ట్రై చేశా' అని రోహిత్ అన్నాడు.

Ind vs Afg 3rd T20: ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్​ ఉంచింది. రింకూ సింగ్ (69* పరుగులు) అద్భుత బ్యాటింగ్​తో అలరించాడు. అనంతంరం అఫ్గాన్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (50), ఇబ్రహీమ్ జర్దాన్ (50), గుల్బాదిన్ నైబ్ (55*) అద్భుత ఆట తీరుతో మ్యాచ్​ను డ్రా గా ముగించారు. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే సూపర్ ఓవర్​లోనూ మ్యాచ్ డ్రా అయ్యింది. ఇక రెండో సూపర్ ఓవర్​లో 10 పరుగుల తేడాతో టీమ్ఇండియా నెగ్గింది. రెండు సూపర్​ ఓవర్లలోనూ బ్యాటింగ్ చేసిన రోహిత్ 14*, 11 పరుగులు బాదాడు.

సూపర్​ ఓవర్​లో రోహిత్ 'స్మార్ట్​నెస్'- రూల్స్ ప్రకారం కరెక్టే!- కోచ్​కు తెలియాలి కదా!

విరాట్ 'సూపర్ మ్యాన్ ఫీట్'- 5 పరుగులు సేఫ్- మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

Last Updated : Jan 20, 2024, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.